అడ్డం:
1. అల్లసాని పెద్దనకు రాయలవారు తొడిగినది ఇదియె? - గండపెండేరమె
3. మగువ జీవితాన్ని ఈ పత్రికతో పోల్చారు దాశరథి. - మల్లెతీగ (ఈ పేరుతో ఒక మాసపత్రిక వస్తోంది)
5.కారుతున్న రైలుసదనములో దాగున్న 'నానో' కర్షకులు :-) - సన్నకారు రైతులు (నానో కారు చిన్నదే కదా!)
7. HDFC బ్యాంకులో దాచిన అంకగణితపు భాగమేనా సారూ? - గ.సా.భా (గరిష్ట సామాన్య భాజకం Highest Common Factor)
9. మొదట్లో తడబడిన బాడీగార్డుకు చివరనుంచి రెండో అక్షరం మటుమాయం. - గఅంరక్షుడు (అంగరక్షకుడు)
10. బంగారు మురుగు - స్వర్ణకంకణం
11. మంచి గొంతుక - సుస్వరం
14. లలామ రకం కతల్లో సులభ సాధ్యం. - కరతలామలకం
15. తలవాకిలి - ముఖద్వారం
16. కవిసార్వభౌమునికి జరిగిన ఒకానొక సత్కారము.
నిలువు:
1.కడివెడు పాలు : ఖరము :: గరిటెడు పాలు : ____ - గంగిగోవు
2. 'జహంగీరు 18వ భార్య'కెన్ని లక్షలు 'కన్యాశుల్కం 19దా'? - మెహరున్నీసా (మెహర్ అంటే కన్యాశుల్కం ఉన్నీస్ అంటే హిందీలో పంతొమ్మిది. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా!)
4. పదిహేడో నెంబరు పురాణం. - గరుడపురాణం (అష్టాదశపురాణాల్లో గరుడపురాణము పదిహేడవది)
5.తెలుగు న్యూసు పేపరు. - సమాచార పత్రిక
6.శీర్షాసనం వేసిన కంసుడు మొదలైన శత్రువులు. - లుకుటకందిసాకం (కంస ఆది కంటకులు)
7. రంగడు సుశీలల మధ్య కఠినము. - గడుసు
8. పరమాణు సంఖ్య 15కల మూలకము. - భాస్వరం
9. ఏనుగు సవారీ ఒక సత్కారమేనా? - గజారోహణము
12.పిల్లంగోవి ఈ బ్లాగరి కలంపేరు. - స్వరలాసిక (పిల్లనగ్రోవికి ఉన్న పర్యాయపదాలలో ఇదొకటి. ఈ పేరుతో నేను అప్పుడప్పుడు పత్రికల్లో రచనలు చేస్తుంటాను.)
13. ఇక్కడ బావిలోన వెలసిన వినాయకుడు కొలువై ఉన్నాడు. - కాణిపాకం (చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి