...

...

30, సెప్టెంబర్ 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 29 సమాధానాలు!


అడ్డం: 

1.  దాశరథి 'అగ్నిధార'ను తొలిసారి ప్రచురించిన నల్లగొండ జిల్లాలోని ప్రఖ్యాత సాహిత్య సంస్థ. - సాహితీ మేఖల 
3. చెరసాల, కారాగారం, జైలు! - బందిఖానా
5. సర్వసాధారణంగా తెలుగు సినిమా హీరోలకు తగిలించ తగిన రెండు విశేషణాలు :) (4,3) - ఆకతాయి, చిలిపి
7. వనం కాని వనం!. - యవ్వనం
9. మనకు తెలిసిన మీసరగండ విశ్వరూపాచారి! - విద్వాన్ విశ్వం.
10. అడ్డం9 ఆయన మీటినది! - మాణిక్యవీణ (ఆంధ్రప్రభలో నిర్వహించిన శీర్షిక)   11. తన్విని విడదీస్తే అదో తృప్తి! - తనివి 
14. అటునుంచి నైట్రోజన్! - వుయువానిజత్రన
15. అర్జునుడు అటునుంచే! - డుయుజవి
16. శృంగార జంట. తస్సాగొయ్యా వీరూ అటునుంచే! - లుథున్మమతీర
నిలువు:
1. తెలుగు సింపతీ! - సానుభూతి
2. తెలంగాణా పోరాటమార్గము అనుకోవచ్చా? - లడాయి తొవ్వ
4. మహతి. - నారదుని వీణ
5.  ప్రాణవాయువు! - ఆక్సిజన్ వాయువు
6. శ్రీరామచంద్రునిలో స్వీకరించదగిన ఉత్తమ గుణము! - పితృవాక్యపాలన
7. ఈ సిన్హాగారు విదేశీవ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఒకప్పటి భాజపా నేత! - యశ్వంత (సిన్హా)
8. ఏరోప్లేను తలక్రిందలయ్యింది. - నంమావి 
9. స్వర్ణకారుడు! - విశ్వబ్రాహ్మణుడు
12. సత్యాసత్యాలు!? - నిజానిజాలు
13. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన కావ్యం! -  విశ్వంభర 

2 కామెంట్‌లు:

Dr.Suryanarayana Vulimiri చెప్పారు...

14 addaM - 'nitrogen gas' ani ivvaali. appuDE daani samaadhaanam 'natrajani vaayuvu' ani tiragabadi raayocchu. mee clue sariggaa lEdu. alaagE 'oxygen' anE anTaaru daanni 'aaksijanu vaayuvu' ani anaru english lO. adE telugulO cheppaalanTE daanni 'praaNa vaayuvu' ani anTaaru. Ee clue kooDa sariggaa ivvalEdu

mmkodihalli చెప్పారు...

సూర్యనారాయణగారూ మీ కౌంటర్‌కు ధన్యవాదాలు. నత్రజనివాయువు, ఆక్సిజన్‌వాయువుల విషయంలో మీరు లేవనెత్తినట్టుగా ఆధారాలు స్పష్టంగా లేవు అని నేను భావించడంలేదు. ఎందుకంటే పూరకులకు నత్రజని, ఆక్సిజన్‌లు వాయురూపంలో ఉంటుందని తెలియదనుకోను. ఆ _ _ న్ _ _ వు అని తెలిసినప్పుడు ఆక్సిజన్‌వాయువు అని, న _ _ ని _ _ వు అని తెలిసినప్పుడు నత్రజని వాయువు అని పూరించగలిగే సామర్థ్యం పజిల్ పూరకులకు ఉంటుందనే అనుకుంటున్నాను. కొన్నికొన్ని సందర్భాలలో పూరకులను తికమక పెట్టేందుకు ఆధారాన్ని స్పష్టంగా ఇవ్వకపోవడం కూడా ఒక స్ట్రాటజీ :)(పైన పేర్కొన్న విషయంలో మాత్రం కాదు). ఆ మాటకు వస్తే నిలువు 2. సమాధానం లడాయి తొవ్వ ఈ పదాలను విడివిడిగా తెలంగాణా యాసలో విన్నాను కానీ ఒకే పదబంధంగా ఎక్కడా వినలేదు.