...

...

14, జనవరి 2011, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 38

మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి కుటుంబసభ్యులు అందరికీ తురుపుముక్క మరియు కథాజగత్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు అందజేస్తున్నది.
 

ఆధారాలు:
1.  శాసన సభలో నాదెండ్ల మనోహరుని హోదా!(2,4)
3. ఈ అపశకునపు పక్షి లక్ష్మీదేవి వాహనమా? (4)
5. యుద్ధంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే ఒక పురస్కారం బాలయ్య సినిమాకు టైటిలయ్యింది.(3,2,2)
7. వైరాగ్యము లేక ప్రతికూలము అటునుంచి.(3)
9. కంచర్ల గోపన్న తానీషాకు చెల్లించాల్సిన శిస్తు సొమ్ముతో మరీ కట్టించినది.(3,2) 
10. ప్రకాశించే బుద్ధి గలవాడు.(5)
11. భారత దేశ భౌతిక పటంలో మోసమున్నదా?!(3)
14.రామదాసు రామునికి వాడిన ఒక విశేషణం. తామరాకులవలె విశాలమైన నేత్రములు కలవాడా అని.(3,4)
15. శ్రీకృష్ణుడు. ముర అనే రాక్షసుడిని సంహరించినవాడు కదా!(4)
16. ఒక రకంగా జిల్లాలకు రాజధాని.(2,4)
నిలువు:
1. కొటారము. తెలుగింటి స్టోరు రూము!(4)
2. పాయసము (శ్రీ+పదహారవ వంతు).(5)
4. ఉత్తరాది ఆంజనేయుడు (6)
5. కృష్ణా ట్రిబ్యూనల్ ముందు మనవాళ్ళు వినిపించింది. కనీసం తెదేపా వారి దృష్టిలో :) (4,3)
6. అనుమతి లేని కట్టడాలకు మన బల్దియా వారి పరిష్కారం?(7)
7. కావ్యము కాదు పొట్టిది.(3)
8. రవి స్ఫుటములో ఉన్నదేదో హఠాత్తుగా బయటపడింది.(3)
9. బుౙపత్తిరి రామునికి ప్రియమైనదా?(6)
12. ఇది చూచి ఇచ్చను కాముకుల్ చిచ్చులో బడుదురు క్షితితలమున అంటాడు వేమన్న.(5)
13. దయగలిగిన గుండెకాయ.(4)

2 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) ఉపసభాపతి, 3) గుడ్లగూబ, 5) పరమవీరచక్ర, 7) ఖంమువి, 9) రామునిగుడి, 10) స్పురద్దీకళి, 11) కపటం, 14) నళినలోచనము, 15) మురవైరి, 16) ముఖ్యపట్టణము.
నిలువు: 1) ఉగ్రాణము, 2) తిరువీశము,4) బజరంగభళి 5) పసలేనివాదన, 6) క్రమబద్దీకరము, 7) ఖండిక, 8) విస్పుటం, 9) రామవల్లభము, 12) పరలోభము, 13) దయార్ద్రము.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ మీరు పంపిన వాటిలో అడ్డం 10,14,నిలువు 4,6,12,13 తప్ప మిగితావి కరెక్టేనండి. 2 నిలువు లో శ కు బదులు స ఉండాలి. అలాగే 15 అడ్డము కరెక్టే కాని నేను అనుకున్నది మరొకటి. మొత్తం మీద అందరికంటే ముందు పంపినందుకు అభినందనలు.