...

...

6, జనవరి 2011, గురువారం

భరత సుతుడా మేలుకో! -21

200.మనలనేలిన వెధవయొక్కడు
       మన చరిత్రను మార్చి చెప్పగ
       సిగ్గులేకను నమ్ముచుంటిమి
       భరత సుతుడా మేలుకో!

201.భూమి భారతి చౌడుబారగ
       విషపు వృక్షములెన్నొ ఎదిగెను
       వేరు దేశపు విత్తనాలవి
       భరత సుతుడా మేలుకో!

202.ఇచట మనిషే పుట్టలేదట
       ఆదిపురుషుడు వలసవాడని
       నొక్కి చెప్పిరి ఆంగ్లేయులు
       భరత సుతుడా మేలుకో!

203.దస్యులార్యులు తన్నుకొనగా
       దస్యులోడిరి పారిపోయిరి
       ఆంగ్లవిద్యలు నుడువుచున్నవి
        భరత సుతుడా మేలుకో!

204.పంచముడు హరిజనుడు దళితుడు
       పేర్లు మారగ సంతసించిరి
       బ్రతుకు తీరున మార్పెలేదుగ
       భరత సుతుడా మేలుకో!


205.పుటుకలోపల ఉచ్చనీచము
       లెంచకూడదు భరతభూమిలొ
       'వాసుదేవు'న కర్థమెరుగగ
        భరత సుతుడా మేలుకో!

206.క్రియాశూన్యుగ భరతసుతుగని
       నల్లబడునిక వెండికొండలు
       ఇంకిపోవును మూడు సంద్రాల్
       భరత సుతుడా మేలుకో!

207.నల్లవారలు తెల్లబడుటకు
       ధనము బోలెడు ఖర్చు చేతురు
       'నల్లనయ్య'యె దేవుడిచ్చట
        భరత సుతుడా మేలుకో!

208.తిరుమలేశుని పూజ చేసెడు
       భాగ్యమొదవిన అయ్యవారలు
      వీధికుక్కకు కేలుమోడ్తురు
      భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి