...

...

3, జనవరి 2011, సోమవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 36 సమాధానాలు!



అడ్డం:
1. సుప్రసన్న,సంపత్కుమార,పేర్వారం,నరసింహారెడ్డిల ఆలోచన చేత చుట్టబడినది.(6) - చేతనావర్తము (దిగంబరకవిత్వానికి పోటీగా కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం,నరసింహారెడ్డి అనే నలుగురు కవులు చేతనావర్తమనే వాదాన్ని ముందుకు తెచ్చారు. చేతనావర్తమనగా ఆలోచనచే కప్పబడినది అని అర్థం)
3. పాతబస్తీలోని ఈ ప్రాంతంలో కాళీపట్నం మేష్టారుని వెదకండి.(4) - కాలాడేరా (ఈ పదంలో కారా అనే అక్షరాలు ఉన్నాయి. కాళీపట్నం రామారావుగారు కారా అనే పొట్టిపేరుతో ప్రసిద్ధులు)
5. హిందీ మన దేశ భాష. మరి ఆంగ్ల భాష? (5,2) - అంతర్జాతీయ భాష
7. బ్రహ్మ కోసం నలువది రోజులు తపస్సు చేస్తే చాలా? (3) - నలువ(ఆధారంలో వెదికితే దొరికిపోతుంది)
9. మాతా శిశు సంక్షేమం కొరకు ఏర్పరచిన కేంద్రము. (6) - అంగనవాడి 
10. సత్యశీలత వంటిదే!(5) - సత్యనిష్ఠత 
11.నడుమ ఉత్వంలోపించిన సస్య విశేషము.(3) - మినము (మినుములో మధ్య అక్షరంలో ఉత్వము తొలగించండి)
14. ఓ తాతా నీవు ఈ వాహనము కలిగినవాడవు.(7) - హంసవాహనుడవు (బ్రహ్మకు ఉన్న పేర్లలో తాత ఒకటి. అతని వాహనము హంస)
15. ఎండ్రకాయ దాక్కొన్న దిరిసెన చెట్టు.(4) - పీతనం (ఈ పదంలో పీత అనే అక్షరాలున్నాయి)
16.న్యూయార్క్ నగరంలోని దర్శనీయ కట్టడం.(3,3) - లిబర్టి విగ్రహం
నిలువు:
1. బొలీవియా విముక్తి పోరాటంలో మరణించిన గెరిల్లా పోరాట యోధుడు మన చేకూరి వారిని అక్కున చేర్చుకున్నారా?(4) - చేగువేరా (ఈ పేరులో చేరా అంటే చేకూరి రామారావుగారిని వెదకవచ్చు)
2. కంటకవల్లరులు.(5) - ముళ్ళతీగలు( వల్లరి అంటే తీగ అని అర్థం)
4. మన రాజకీయనాయకులు పెక్కురిలో ఇది లోపించినది.(6) - రాజనీతిజ్ఞత (ఒప్పుకొంటారా:-))
5. ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలతో పాటు  చీకట్లో కాంతిరేఖలు కూడా చూపించిన ఆదర్శ రచయిత.(3,4) - అంతటి నరసింహం( డా.అంతటి నరసింహంగారు ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు అనే అంశంపై పరిశోధన చేశారు. అలాగే  చీకట్లో కాంతిరేఖలు అనే నవలను రచించారు)  
6. అభిదాన రత్నమాల - తెనుఁగర్థముగల సంస్కృత నిఘంటువు. దీనికి మరియొక పేరు. (3,4)  - షడ్రస నిఘంటువు
7. మధ్య.(3) - నడిమి  
8. నవాసములో సంభవం.(3) - వసము
9.కొలిమియో కుంపటియో ఏదో ఒకటి.(6) - అంగారధానిక   
12. నవాబు గారి కొత్త భవంతి.(2,3) - నయా హవేలి (ఉర్దూపదాన్ని సూచించేందుకు నవాబుగారు అనే హింట్ ఇవ్వబడింది)
13. ఆరుద్ర కవిత్వంతో మేవా(ముస్లిం ఎంప్లాయీస్ వెల్‌ఫేర్ అసోసియేషన్)కు పని యేమిటి?(4) - త్వమేవాహం (త్వమేవాహమ్ ఆరుద్ర వ్రాసిన కవిత్వం)

ఈ పజిల్‌ను ప్రయత్నించిన చదువరి,భమిడిపాటి సూర్యలక్ష్మి,మహెక్ గార్లకు అభినందనలు! కంది శంకరయ్యగారికి కృతజ్ఞతలు!

2 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

మాస్టారూ, ఒక సందేహం.. ’సత్యనిష్ఠత’ సరైనమాటేనా? సత్యనిష్ఠ అని అనుకుంటూన్నాను.

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ! నిష్ఠతము అనే పదం శబ్దార్థచంద్రికలో ఉంది.'ము' ప్రత్యయాన్ని విడిచి శబ్దాన్ని ప్రయోగించే సంప్రదాయం మనకు ఉంది కదా. కాబట్టి 'సత్యనిష్ఠత' సాధు రూపమే.