...

...

3, జూన్ 2010, గురువారం

క్రాస్‍వర్డు పజిలు సాల్వుము - 10ఆధారాలు: 

అడ్డం: 
1. నవరస అయితే కైకాల. విశ్వవిఖ్యాత అయితే నందమూరి.
3. పోtown!  గుడికి సంబంధించింది.
5.బ్రీఫ్ ఇంట్రో!
7. నాయీబ్రాహ్మణుడు ప్రసాదించే వరం!
9. అన్నమయ్య, క్షేత్రయ్యల కోవకు చెందిన ఒక వాగ్గేయకారుడు.
10. నవగోతములో చొప్పడియున్న పొగరు.
11. రా మరదలా అంటున్న విశ్వబ్రాహ్మణుడు.
14. చందాలు వసూలు చేసే వారి హస్త భూషణము కుడి నుంచి.
15.  శుభకార్యాలకు పెట్టేది?
16. మొఘలుల కాలంలో మన దేశానికి దిగుమతి అయిన ఈ తీపి మిఠాయి కావాలంటే మూను జాబ్ లాగు. 

నిలువు:
1. క్షుల్లకము/ శంఖనఖము
2. పడమర వస్తున్న  మోటారు బోటు.
4. మూడు రంగుల మృగశ్రేష్ఠము!
5.కాంపోజిట్ మ్యాథ్స్!
6.ఇవి తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ స్టేట్‍మెంట్! కాకపోతే ఏక వచనంలో!
7. సాధారణంగా ఆవేశం నిడివి.
8. కాస్త నాజుగ్గా అయితే రంగవల్లికే!
9. లోకవిదితము, జనసాధారణము, బహిరంగము.(?) 
12. తంతునాభము
13. ధూమశకట వాహన గమనాగమన నిర్దేశ సూచికా స్తంభము.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి