...

...

25, జూన్ 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -13 సమాధానాలు!



అడ్డం: 
1. నాగార్జున, టబుల హిట్ సినిమా.   - నిన్నే పెళ్ళాడుతా 
3. రమణారెడ్డిగారి ఈ కథ కథాజగత్‌లో దర్శనమిస్తుంది.  - జుట్టుమామ
5. ఆరుద్ర గుండెలూపిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.  - కొంటెబొమ్మల బాపు (కొంటెబొమ్మల బాపు/ కొన్ని తరముల సేపు/ గుండె ఊయలలూపు/ఓ కూనలమ్మా! - ఆరుద్ర)
7. మాజీ ముఖ్యమంత్రి యింటిపేరులోనున్న రక్తపాయిని. - జలగ (జలగం వెంగళరావు)
9. కిమ్మీరపు మొలక!  - నారింజ మొక్క
10. తీపిరోగం! -  మధుమేహము 
11.  చాప్టర్ 4.5 ఆఫ్ కృష్ణయజుర్వేదం! - నమకం 
14.  ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తనని ఈరాగంలో ఆలపించండి.  - నటభైరవి రాగం 
15. డైరీ తిరగబడింది.  - ర్యచనది 
16.పురపాలక సంఘము.  - మునిసిపాలిటి

నిలువు:
1. ఈ పజిల్ పూరణకు ఇది అవసరమా? - నిఘంటువు 
2.  శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా పాట ఈ చిత్రంలోనిది. - తాతమ్మకల 
4. మెంతిఆకును కూరగా వాడితే ఇది తగ్గుతుంది. - మలబద్ధకము [చూశారా నా బ్లాగులో హెల్త్ టిప్స్ కూడా దొరుకుతున్నాయి:))]
5.  చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు. - కొంపెల్ల జనార్ధన (కొంపెల్ల జనార్ధన రావు  ప్రముఖ భావకవి మరియు నాటికా రచయిత. కృష్ణా పత్రిక వీరికి "చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ" అనే బిరుదు ప్రసాదించింది.)
 6.  రామ లక్ష్మణ భరత శతృఘ్నుల  జన్మకు మూలము.  - పుత్రకామేష్టియాగం 
7. నిలువుమా నిలువుమా నీలవేణి అంటున్న అమరశిల్పి! - జక్కన ( ఈ పాట అమరశిల్పి జక్కన సినిమాలోనిది)
8. సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని ____ అంటారు. - గమకం 
9.  మనువు పుట్టువు, మెచ్చుల పచ్చమ్రుచ్చిలి మొదలైన అచ్చతెనుగు కబ్బములను వ్రాసిన కవిపండితుడు. - నారునాగనార్య ( ఈ కవి పెద్దన్నగారి మనుచరిత్రమును మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కుతిమ్మన్నగారి పారిజాతాపహరణమును మెచ్చులపచ్చలమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెనుగులో అనువదించినారు.) 
12. దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల _ _ _ _ _ ||  - మనోరథము (అన్నమయ్య కీర్తన)
13. విధము, క్రమము.  - పరిపాటి 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

చాలా బావుంది. కష్టమైన క్లూలు కొన్ని, బుర్రకు పని పెట్టేవి కొన్ని ఇచ్చారు. నాకు చాలా నచ్చింది.