...

...

22, జూన్ 2010, మంగళవారం

చాటభారతం

ఈ రోజు కథాజగత్ కోసం ఓ కథను టైప్ చేస్తూ ఉంటే మా ఆవిడ కాస్త విసుగ్గా "ఎప్పుడూ ఏమిటండీ  చాటభారతం వ్రాస్తుంటారు" అని కోప్పడింది. ఈ చాటభారతం అనే పదం ఎలా పుట్టిందో, ఏ అర్థంలో  దీనిని వాడతారో విజ్ఞులెవరైనా తెలిపితే తెలుసుకొని సంతోషిస్తాను.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అది చాటు భారతం అంటే చాటువు లతో కూడిన భారతం...ఉపకతలతో నిండిన భారతం అన్న మాట

అజ్ఞాత చెప్పారు...

'కథ' అప్పుతచ్చు

జ్యోతి చెప్పారు...

ఈ మాటకు చాటు భారతమనే రూపాంతరం ఉందంటారు కొందరు. కానీ ఆ రెంటికి అర్ధాలు వేరు . చేట తెలుగు మాట. చాటు సంస్కృత పదం. అప్పటికప్పుడు చెప్పిన, నోటిమాటగా చెప్పిన అనే అర్ధాలున్న మాట చాటు(వు). చెరగటానికి వాడే చేట తెలుగు వస్తువు. గ్రంధ ప్రమాణాల వంటివి చూపకుండా భారత కథను చెప్తే అది చాటు భారతం.నిజానికది జాతీయమే కాదు. చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపొయ్యే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెపినా, రాసినా దాన్ని చేట భారతమనే అంటారు. అయితే ఈ మాట ఇటీవల పుట్టిందనటానికి నిదర్శనం ఉంది. దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట, అచ్చు యంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికల కన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు. అంటే చేటంత పెద్ద కాగితాల మీద అచ్చు వేసారన్నమాట. ఆ గ్రంధాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంధాలయాల్లో భద్రంగా ఉన్నాయి. సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో, వృత్తాలను రెండు పంక్తుల్లో, కందం, తేటగీతి, ఆటవెలది వంటి పదాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు. ఆ గ్రంధాలను కూర్చుని చదవాల్సిందే.

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత,జ్యోతి గార్లకు నెనర్లు. జ్యోతిగారూ చాటభారతం గురించి చాటభారతమంత వివరణ యిచ్చారు. ధన్యవాదాలు!

కంది శంకరయ్య చెప్పారు...

జ్యోతి గారూ,
మీ వివరణ బాగుంది.

ramnarsimha చెప్పారు...

Sir,

Nice question..

Keep it up..

We know everything..

ll sruprise u with our answers..