అడ్డం:
1. ఛందోబద్ధమైన కవిత కాదండోయ్! - నిశ్ఛంద కవిత
3. సినిమాల్లో రాజబాబు జోడీ! - రమాప్రభ
5. నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి పేరు తెచ్చిపెట్టిన కథలు. - పచ్చనాకు సాక్షిగా
7. మేక మధ్యన శకుంతలమ్మ! - మేనక (శకుంతల అమ్మ)
9. జాతీయ జంతువు. - చారల పులి
10. తబ్బిబ్బెగు కోమలి లక్ష్మియా? - లిబ్బిగుబ్బెత
11. అభిరామి సిమి గరేవాల్‌ల జాయింటు సంపద! - మిసిమి
14. అల్లనల్లన అలవోకగా... సుభద్రగారి బ్లాగు కలగాపులగమయింది. - రివాకొబ్బచెట్టులు (వాలు కొబ్బరి చెట్టు)
15. నెత్తురు. - క్షతదము
16. మాయాబజార్‌లో ఆర్.నాగేశ్వరరావు ఊతపదం పాక్షికంగా! - తక్షణ కర్తవ్యం (మాయాబజార్ సినిమాలో ఇదే మన తక్షణ కర్తవ్యం అనేది దుశ్శాసనుడి ఊతపదం.)
నిలువు:
1. తమిళ తమ్ముడికిరువైపులా నిను గలిగిన స్త్రీ. - నితంబిని
2. నిగనిగ కాంతులు మెఱయగ - తళుకులీన
4. గంగానదిని ఇలా పిలువవచ్చా! - భగీరథ సుత
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము! - పశువుల కాపరి
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము! - పశువుల కాపరి
6. గార్ధభాశ్వములు. ఒకే జాతివి కదా! - గాడిద గుఱ్ఱములు
7. జూన్ ముందు మొదలయిన శ్రేష్ఠము! - మేలిమి (జూన్ ముందు వచ్చే నెల మే)
8. లేమికి వ్యతిరేకం!కావడి కుండల్లో ఒకటి! - కలిమి (కలిమిలేములు కావడికుండలు అన్నాడొ సినీ కవి)
9. నాల్గు నెలల పూనిక సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు చేపట్టేది! - చాతుర్మాస దీక్ష
12. అడ్డం ఐదు రచయితదే మరో రచన చివర ఎగిరిపోయింది. - సినబ్బకత
13. మంచి కళాత్మక చలన చిత్రాన్ని దీనితో పోల్చవచ్చు. - దృశ్యకావ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి