...

...

12, జూన్ 2010, శనివారం

కథాజగత్‌లో 100వ కథ!

కొండేపూడి నిర్మల గారి కథ ప్రేమ జిల్లాలు కథాజగత్‌లో ప్రకటించాము. దీనితో కథాజగత్‌లో కథల సంఖ్య మూడంకెలకు చేరింది. ఈ సందర్భంగా మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ మాకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తున్న కథా రచయితలకు, పాఠక మహాశయులకు, కథాభిమానులకు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతాభివందనములు. ఇప్పుడు మేము మా లక్ష్య సాధనలో మొదటి ఘట్టంలోనే ఉన్నాము. మున్ముందు మీ ప్రోత్సాహ సహకారాలతో ఈ కథాజగత్ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని మా నమ్మకం. ఈ కథాజగత్‌లో ప్రకటించడానికి కథలను పంపవలసిందిగా ఈ సందర్భంగా కథకులైన బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ మీ కథలను యూనీ కోడ్‌లో (ఇంతవరకూ అంతర్జాలంలో ప్రకటింపబడని కథలను) పంపి మా ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాము.      
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి