మతకల్లోలాలెప్పుడూ... మతాల్లోంచి పుట్టుకరావు. రాజకీయంలోంచి పుట్టుకొస్తాయి. ఈ నగ్న సత్యం ఎప్పుడూ బయటపడకుండా... నాయకులెప్పుడూ జాగర్త పడుతుంటారు అంటున్నారు కె.వి.నరేందర్ తమ కల్లోలం కథలో. ఈ కథ కథాజగత్‌లో చదవండి.
...

28, జూన్ 2010, సోమవారం
కె.వి.నరేందర్ కథ
మతకల్లోలాలెప్పుడూ... మతాల్లోంచి పుట్టుకరావు. రాజకీయంలోంచి పుట్టుకొస్తాయి. ఈ నగ్న సత్యం ఎప్పుడూ బయటపడకుండా... నాయకులెప్పుడూ జాగర్త పడుతుంటారు అంటున్నారు కె.వి.నరేందర్ తమ కల్లోలం కథలో. ఈ కథ కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
27, జూన్ 2010, ఆదివారం
అహో...! ఆంధ్రభోజా...!!
సాహితీ సమరాంగణ చక్రవర్తి, మురురాయ గండడు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాలను జూలై5 నుండి ఆగస్టు9 వరకు ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతి కళలకు పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలను ఈ విధంగా గుర్తు చేసుకోవడం అభినందనీయం. ఈ సందర్భంగా తురుపుముక్క రాయలవారికి జోహారులర్పిస్తున్నది.
ఆంధ్ర భారతి మన మానందమున పొంగ
అష్ట దిగ్గజ రత్న హారమొసగి
జగమెల్ల జేజేల జయనాదములు నిండ
శౌర్య ప్రౌఢిమ చేత శాంతి నిల్పి
సంగీత నాట్యాది సకల కళారాధ
నమ్మున ప్రజల కానంద మొసగి
జనమనమ్ముల భక్తి జాగృతమ్మగునట్లు
గుడుల గోపురముల కోరి నిల్పి
ఎందు కనమిట్టి మెండైన ఏలికనుచు
కవులు నీ కీర్తి పొగడంగ కావ్యములను
మా మనమ్ముల స్థిరముగ మనెదువయ్య
ధీర శృంగార శ్రీ కృష్ణ దేవరాయ!
- ఫణి ప్రసన్న కుమార్
అష్ట దిగ్గజ రత్న హారమొసగి
జగమెల్ల జేజేల జయనాదములు నిండ
శౌర్య ప్రౌఢిమ చేత శాంతి నిల్పి
సంగీత నాట్యాది సకల కళారాధ
నమ్మున ప్రజల కానంద మొసగి
జనమనమ్ముల భక్తి జాగృతమ్మగునట్లు
గుడుల గోపురముల కోరి నిల్పి
ఎందు కనమిట్టి మెండైన ఏలికనుచు
కవులు నీ కీర్తి పొగడంగ కావ్యములను
మా మనమ్ముల స్థిరముగ మనెదువయ్య
ధీర శృంగార శ్రీ కృష్ణ దేవరాయ!
- ఫణి ప్రసన్న కుమార్
Labels:
royal
26, జూన్ 2010, శనివారం
25, జూన్ 2010, శుక్రవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -13 సమాధానాలు!
అడ్డం:
1. నాగార్జున, టబుల హిట్ సినిమా. - నిన్నే పెళ్ళాడుతా
3. రమణారెడ్డిగారి ఈ కథ కథాజగత్‌లో దర్శనమిస్తుంది. - జుట్టుమామ
5. ఆరుద్ర గుండెలూపిన సత్తిరాజు లక్ష్మీనారాయణ. - కొంటెబొమ్మల బాపు (కొంటెబొమ్మల బాపు/ కొన్ని తరముల సేపు/ గుండె ఊయలలూపు/ఓ కూనలమ్మా! - ఆరుద్ర)
7. మాజీ ముఖ్యమంత్రి యింటిపేరులోనున్న రక్తపాయిని. - జలగ (జలగం వెంగళరావు)
9. కిమ్మీరపు మొలక! - నారింజ మొక్క
10. తీపిరోగం! - మధుమేహము
11. చాప్టర్ 4.5 ఆఫ్ కృష్ణయజుర్వేదం! - నమకం
14. ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తనని ఈరాగంలో ఆలపించండి. - నటభైరవి రాగం
15. డైరీ తిరగబడింది. - ర్యచనది
16.పురపాలక సంఘము. - మునిసిపాలిటి
నిలువు:
1. ఈ పజిల్ పూరణకు ఇది అవసరమా? - నిఘంటువు
2. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా పాట ఈ చిత్రంలోనిది. - తాతమ్మకల
4. మెంతిఆకును కూరగా వాడితే ఇది తగ్గుతుంది. - మలబద్ధకము [చూశారా నా బ్లాగులో హెల్త్ టిప్స్ కూడా దొరుకుతున్నాయి:))]
5. చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు. - కొంపెల్ల జనార్ధన (కొంపెల్ల జనార్ధన రావు ప్రముఖ భావకవి మరియు నాటికా రచయిత. కృష్ణా పత్రిక వీరికి "చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ" అనే బిరుదు ప్రసాదించింది.)

6. రామ లక్ష్మణ భరత శతృఘ్నుల జన్మకు మూలము. - పుత్రకామేష్టియాగం
7. నిలువుమా నిలువుమా నీలవేణి అంటున్న అమరశిల్పి! - జక్కన ( ఈ పాట అమరశిల్పి జక్కన సినిమాలోనిది)
8. సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని ____ అంటారు. - గమకం
9. మనువు పుట్టువు, మెచ్చుల పచ్చమ్రుచ్చిలి మొదలైన అచ్చతెనుగు కబ్బములను వ్రాసిన కవిపండితుడు. - నారునాగనార్య ( ఈ కవి పెద్దన్నగారి మనుచరిత్రమును మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కుతిమ్మన్నగారి పారిజాతాపహరణమును మెచ్చులపచ్చలమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెనుగులో అనువదించినారు.)
12. దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల _ _ _ _ _ || - మనోరథము (అన్నమయ్య కీర్తన)
13. విధము, క్రమము. - పరిపాటి
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
24, జూన్ 2010, గురువారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -13
ఆధారాలు:
అడ్డం:
1. నాగార్జున, టబుల హిట్ సినిమా.
3. రమణారెడ్డిగారి ఈ కథ కథాజగత్‌లో దర్శనమిస్తుంది.
5. ఆరుద్ర గుండెలూపిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.
7. మాజీ ముఖ్యమంత్రి యింటిపేరులోనున్న రక్తపాయిని.
9. కిమ్మీరపు మొలక!
10. తీపిరోగం!
11. చాప్టర్ 4.5 ఆఫ్ కృష్ణయజుర్వేదం!
14. ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తనని ఈరాగంలో ఆలపించండి.
15. డైరీ తిరగబడింది.
16.పురపాలక సంఘము.
నిలువు:
1. ఈ పజిల్ పూరణకు ఇది అవసరమా?
2. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా పాట ఈ చిత్రంలోనిది.
4. మెంతిఆకును కూరగా వాడితే ఇది తగ్గుతుంది.
5. చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు.
5. చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు.
6. రామ లక్ష్మణ భరత శతృఘ్నుల జన్మకు మూలము.
7. నిలువుమా నిలువుమా నీలవేణి అంటున్న అమరశిల్పి!
8. సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని ____ అంటారు.
9. మనువు పుట్టువు, మెచ్చుల పచ్చమ్రుచ్చిలి మొదలైన అచ్చతెనుగు కబ్బములను వ్రాసిన కవిపండితుడు.
12. దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల _ _ _ _ _ ||
13. విధము, క్రమము.
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
రిపోర్ట్
23-6-2010 బుధవారం సాయంత్రం ఏ.ఎస్.రావు నగర్, హైదరాబాద్‌లో కోకిలమ్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు గారి కొత్త కవితా సంపుటి ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల ఆవిష్కరణ సభ జరిగింది. కథాఋషి శ్రీ మునిపల్లె రాజు అధ్యక్షతన ఏర్పాటైన ఈ సభకు మరో కథారచయిత శ్రీ విహారి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదట వేదికపై ఉన్న ప్రముఖులను శ్రీ పులిగడ్డ విశ్వనాథరావు సభికులకు పరిచయం చేశారు. తరువాత సభ ఇటీవల మరణించిన కవి వేటూరి సుందరరామమూర్తికి నివాళిగా రెండు నిముషాలు మౌనం పాటించింది. సభాధ్యక్షులు శ్రీ మునిపల్లె రాజు మాట్లాడుతూ కవి అనేవాడు మానవజీవితంలోని సంక్లిష్టమైన భయాందోళనలను దూరం చేయగలగాలని, కవి స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట కూడా అని అన్నారు. డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు వంటివారికి ప్రభుత్వ సంస్థలనుండి, విశ్వవిద్యాలయాలనుండి రావలిన గుర్తింపు, లభించవలసిన గౌరవం దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ విహారి పుస్తకాన్ని ఆవిష్కరించి డాక్టర్ అద్దేపల్లితో తన సాన్నిహిత్యాన్ని వివరిస్తూ మచిలీపట్నం విశేషాలను జ్ఞాపకం చేసుకున్నారు. అద్దేపల్లి కవిత్వంలో అనేక కవితా లక్షణాలున్నా అక్కడక్కడ అవసరం అనుకున్న చోట సూటిగా చెప్పేతత్వం ఉందని అవి పాఠకుని హృదయాన్ని తాకి వెంటాడుతూ వుంటుందని అన్నారు. సాధారణంగా కవితా సంపుటులకు పొడుగైన పేరు ఉండదని ఈ పుస్తకం పేరు పెట్టడం నుండే ఈ పుస్తకం ప్రత్యేకత మొదలౌతున్నదని అన్నారు. ఈ కవితాసంపుటిని శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమీక్షించారు. అద్దేపల్లి కవిత్వంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందనీ, వారు ఏ విషయంపై కవిత్వం వ్రాసినా చివరకు అందులో పీడిత వర్గాల ప్రస్తావన వచ్చి తీరుతుందని శ్రీ కొండ్రెడ్డి వివరించారు. తరువాత శ్రీ తంగిరాల చక్రవర్తి ఈ పుస్తకంపై, అద్దేపల్లి కవిత్వంపై తమదైన రీతిలో ప్రసంగించారు. ఈ పుస్తకంలోని కవితలన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని అన్ని భాషల్లోకి అనువాదం కావలసిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు తమ స్పందనను తెలియజేస్తూ తాను కవిమాత్రమే కాక విమర్శకుడు కూడా కావడం వల్ల తనకు అన్ని రాజకీయ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్నదని దానివల్లే గత 20 సంవత్సరాలుగా మనదేశంలో జరుగుతున్న సాంస్కృతిక దాడిని ముందునుంచే గుర్తించి తన కవిత్వాన్ని ఈ పోకడలకు వ్యతిరేకంగా వినిపిస్తున్నానని అన్నారు. తాను చిన్నప్పుడు చదువుకున్న విశ్వనాథ వారి నవల వేయిపడగలు తనపై కొంత ప్రభావాన్ని చూపిందన్నారు. ప్రస్తుతం యువకులనుండి మంచి మంచి కవిత్వం వస్తున్నదనీ, కానీ విమర్శ విషయంలో లోటు కనిపిస్తున్నదనీ దానిని భర్తీ చేయవలసిన బాధ్యత నేటి యువ సాహితీవేత్తలపై ఉందని అన్నారు. అద్దేపల్లి అభిమానులూ, శిష్యులూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభ ప్రారంభానికి ముందు కవితా పఠనం కూడా జరిగింది. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు డాక్టర్ అద్దేపల్లి బాల్యంపై వ్రాసిన గజల్‌ను పాడి వినిపించారు. చివరగా శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.
22, జూన్ 2010, మంగళవారం
చాటభారతం
ఈ రోజు కథాజగత్ కోసం ఓ కథను టైప్ చేస్తూ ఉంటే మా ఆవిడ కాస్త విసుగ్గా "ఎప్పుడూ ఏమిటండీ చాటభారతం వ్రాస్తుంటారు" అని కోప్పడింది. ఈ చాటభారతం అనే పదం ఎలా పుట్టిందో, ఏ అర్థంలో దీనిని వాడతారో విజ్ఞులెవరైనా తెలిపితే తెలుసుకొని సంతోషిస్తాను.
21, జూన్ 2010, సోమవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 12 సమాధానాలు!
అడ్డం:
1. దత్తపుత్రుడు. - పెంపుడు కొడుకు
3. జాతీయ తాప విద్యుత్ సంస్థ! - ఎన్టీపీసీ (National Thermal Power Corporation)
5. ఈ శీర్షిక ఇదేపేరుతోనో మరోపేరుతోనో దాదాపు అన్ని పత్రికల్లోనూ కనిపిస్తుంది. - గ్రంథ పరిచయము
7. రాగం తానం తోడిది పాటకి ప్రాణమైనది. - పల్లవి
9. పంచాక్షరిలో పంచాక్షరి! - అనుష్కా శెట్టి (పంచాక్షరి సినిమాలో నటించిన ఐదు అక్షరాల పేరున్న నటి)
10. దాసరి మార్కు జానపద నవల. చందమామ ధారావాహిక! - రాకాసిలోయ (దాసరి సుబ్రహ్మణ్యం గారి పిల్లల జానపద నవల)
11. కరాళికము మొదలు భీకరమా! - కరాళి (కరాళికము అంటే చెట్టు, కరాళి అంటే భయంకరము)
14. కంచర్ల గోపన్నకు ఆరాధ్య దైవం! - భద్రాచల రాముడు
15. వదరుబోతుకు వ్యతిరేకి! - మితభాషి
16. అరవ్వాడి మోర్కుళంబు! - మజ్జిగపులుసు (మోర్కుళంబు అంటే తమిళంలో మజ్జిగపులుసు)
నిలువు:
1. అశుద్ధంతో ఆరంభమయ్యే అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం! - పెంటగాన్/పెంటగన్/పెంటగాను/పెంటగను
2. కథానాయిక వాణిశ్రీ నటించిన కవయిత్రి పాత్ర! - కుమ్మరిమొల్ల ( కవయిత్రి మొల్ల వాణిశ్రీ నటించిన సినిమా)
4. మనిలా టామరిండ్ అను గుబ్బకాయ! - సీమచింతకాయ
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది. - గ్రంథావిష్కార సభ
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది. - గ్రంథావిష్కార సభ
6. శూర్ఫణఖకు లక్ష్మణుడు ఏమవుతాడు? - ముక్కు కోసినవాడు :)
7. జాబితా! - పట్టిక
8. మోహమైనా, భక్తియైనా అడ్డం 11లాగే ధ్వనించేది. - విరాళి (విరాళి అంటే కామము, భక్తి అనే రెండు అర్థాలున్నాయి)
9. బొంబాయి నాయకుడు ! - అరవిందస్వామి (బొంబాయి సినిమా హీరో!)
12. మోహన్ బాబు, ప్రియా గిల్ నటించిన సినిమా ఈ రామన్న చౌదరి! - రాయలసీమ
13. శ్రీకృష్ణ దేవరాయల కుడిభుజం ఈ అరుసు! - తిమ్మరుసు
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
20, జూన్ 2010, ఆదివారం
కథకులూ... బ్లాగర్లూ...
కథాజగత్‌లోని కథల జాబితా పరిశీలిస్తుంటే సుమారు డజనుకు పైగా రచయితలు బ్లాగులను నడుపుతున్నట్టు గమనించాను. అంటే బ్లాగర్లలో గణనీయమైన స్థాయిలో కథా రచయితలు ఉన్నారన్నమాట! ఆ రచయితలు వారి తెలుగు బ్లాగులూ ఇవిగో ఇక్కడ -
7. బృహస్పతి[విహారి (రాజేష్)] - వికాసం
8. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి - మంచికంటి
9. నాగసూరి వేణుగోపాల్ - SPECTRUM
8. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి - మంచికంటి
9. నాగసూరి వేణుగోపాల్ - SPECTRUM
12. కోడీహళ్లి మురళీమోహన్ - తురుపుముక్క
13. జి.యస్.లక్ష్మి - శ్రీలలిత
14. మల్లాది వెంకట కృష్ణమూర్తి - మల్లాది వెంకట కృష్ణమూర్తి బ్లాగ్
13. జి.యస్.లక్ష్మి - శ్రీలలిత
14. మల్లాది వెంకట కృష్ణమూర్తి - మల్లాది వెంకట కృష్ణమూర్తి బ్లాగ్
ఇంకా చాలామంది బ్లాగర్లు కథలు వ్రాస్తున్నారు కానీ వారి చూపు ఎందుకో ఇంకా కథాజగత్పై పడలేదు.
19, జూన్ 2010, శనివారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 12
ఆధారాలు:
అడ్డం:
1. దత్తపుత్రుడు.
3. జాతీయ తాప విద్యుత్ సంస్థ!
5. ఈ శీర్షిక ఇదేపేరుతోనో మరోపేరుతోనో దాదాపు అన్ని పత్రికల్లోనూ కనిపిస్తుంది.
7. రాగం తానం తోడిది పాటకి ప్రాణమైనది.
9. పంచాక్షరిలో పంచాక్షరి!
10. దాసరి మార్కు జానపద నవల. చందమామ ధారావాహిక!
11. కరాళికము మొదలు భీకరమా!
14. కంచర్ల గోపన్నకు ఆరాధ్య దైవం!
15. వదరుబోతుకు వ్యతిరేకి!
16. అరవ్వాడి మోర్కుళంబు!
నిలువు:
1. అశుద్ధంతో ఆరంభమయ్యే అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం!
2. కథానాయిక వాణిశ్రీ నటించిన కవయిత్రి పాత్ర!
4. మనిలా టామరిండ్ అను గుబ్బకాయ!
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది.
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది.
6. శూర్ఫణఖకు లక్ష్మణుడు ఏమవుతాడు?
7. జాబితా!
8. మోహమైనా, భక్తియైనా అడ్డం 11లాగే ధ్వనించేది.
9. బొంబాయి నాయకుడు !
12. మోహన్ బాబు, ప్రియా గిల్ నటించిన సినిమా ఈ రామన్న చౌదరి!
13. శ్రీకృష్ణ దేవరాయల కుడిభుజం ఈ అరుసు!
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
17, జూన్ 2010, గురువారం
ముళ్ళకంచె
పాతూరి అన్నపూర్ణగారి కథ ముళ్ళకంచె కథాజగత్‌లో చదవండి. త్వరలో కథాజగత్‌లో వెలువడనున్న కథల వివరాలు...
1.తాడిగిరి పోతరాజు - నిరవధిక నిరీక్షణ
2.కె.వి.నరేందర్ - కల్లోలం
3.రమగమిని - ఆలోకనం
4.ఈతకోట సుబ్బారావు - కాశీబుగ్గ
5. గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు - పన్నూబోయె పరువూబోయె
2.కె.వి.నరేందర్ - కల్లోలం
3.రమగమిని - ఆలోకనం
4.ఈతకోట సుబ్బారావు - కాశీబుగ్గ
5. గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు - పన్నూబోయె పరువూబోయె
6.దేవరకొండ సహదేవరావు - సకల
Labels:
katha jagat
14, జూన్ 2010, సోమవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -11 సమాధానాలు!
అడ్డం:
1. ఛందోబద్ధమైన కవిత కాదండోయ్! - నిశ్ఛంద కవిత
3. సినిమాల్లో రాజబాబు జోడీ! - రమాప్రభ
5. నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి పేరు తెచ్చిపెట్టిన కథలు. - పచ్చనాకు సాక్షిగా
7. మేక మధ్యన శకుంతలమ్మ! - మేనక (శకుంతల అమ్మ)
9. జాతీయ జంతువు. - చారల పులి
10. తబ్బిబ్బెగు కోమలి లక్ష్మియా? - లిబ్బిగుబ్బెత
11. అభిరామి సిమి గరేవాల్ల జాయింటు సంపద! - మిసిమి
14. అల్లనల్లన అలవోకగా... సుభద్రగారి బ్లాగు కలగాపులగమయింది. - రివాకొబ్బచెట్టులు (వాలు కొబ్బరి చెట్టు)
15. నెత్తురు. - క్షతదము
16. మాయాబజార్లో ఆర్.నాగేశ్వరరావు ఊతపదం పాక్షికంగా! - తక్షణ కర్తవ్యం (మాయాబజార్ సినిమాలో ఇదే మన తక్షణ కర్తవ్యం అనేది దుశ్శాసనుడి ఊతపదం.)
నిలువు:
1. తమిళ తమ్ముడికిరువైపులా నిను గలిగిన స్త్రీ. - నితంబిని
2. నిగనిగ కాంతులు మెఱయగ - తళుకులీన
4. గంగానదిని ఇలా పిలువవచ్చా! - భగీరథ సుత
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము! - పశువుల కాపరి
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము! - పశువుల కాపరి
6. గార్ధభాశ్వములు. ఒకే జాతివి కదా! - గాడిద గుఱ్ఱములు
7. జూన్ ముందు మొదలయిన శ్రేష్ఠము! - మేలిమి (జూన్ ముందు వచ్చే నెల మే)
8. లేమికి వ్యతిరేకం!కావడి కుండల్లో ఒకటి! - కలిమి (కలిమిలేములు కావడికుండలు అన్నాడొ సినీ కవి)
9. నాల్గు నెలల పూనిక సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు చేపట్టేది! - చాతుర్మాస దీక్ష
12. అడ్డం ఐదు రచయితదే మరో రచన చివర ఎగిరిపోయింది. - సినబ్బకత
13. మంచి కళాత్మక చలన చిత్రాన్ని దీనితో పోల్చవచ్చు. - దృశ్యకావ్యం
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
13, జూన్ 2010, ఆదివారం
తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ!
తెలుగు కథ శతవార్షికొత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 100 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా కథజగత్లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను ఇక్కడ కామెంటు రూపంలో ఇవ్వడమే. వచ్చిన ఎంట్రీలలో ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నాము.
ఈ పోటీ 13 జూన్ 2010 నుండి 12 జులై 2010 వరకు వుంటుంది. 12-07-2010 సాయంత్రం 6.00గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది.
నియమ నిబంధనలు:
1. మీ విశ్లేషణను మీ బ్లాగులోనే టపా రూపంలో ప్రకటించాలి. మీ ఎంట్రీలో కథ పేరు కథా రచయిత పేరు స్పష్టంగా పేర్కొనాలి. ఆ కథకు చెందిన లింకును కూడా మీ టపాలో తప్పనిసరిగా ఇవ్వాలి.
2. మీ విశ్లేషణ సుమారు 200 - 500 పదాల మధ్య వుండాలి.
3. మీ టపా సాధ్యమైనంత వరకూ మీరు విశ్లేషించబోయే కథకు పరిమితమై వుండాలి. వ్యక్తిగతంగా ఎవరనీ కించపరిచేదిగా వుండరాదు. అలాంటి ఎంట్రీలు పోటికి పరిశీలింపబడవు.
4. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా విశ్లేషించ వచ్చు. అయితే ప్రతి కథను విడివిడిగా విశ్లేషించి విడివిడి టపాల్లో పెట్టాలి.
5. ఈ పోటీగురించి మీ బ్లాగులో ప్రకటించ వచ్చు కానీ అది కంపల్సరీ మాత్రం కాదు.
6. ఈ పోటీ వున్నంత కాలం, మరియూ ఫలితాలు ప్రకటించే వరకూ మీ ఎంట్రీలను మీ బ్లాగునుండి డిలిట్ చేయరాదు.
7. మీ ఎంట్రీలలోని కంటెంట్‌ను తురుపుముక్కలోగానీ, కథాజగత్‌లో కానీ లేదా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉపయోగించుకునే( ఆ రచయితకు క్రెడిట్ యిస్తూ) హక్కు మాకు వుంటుంది.
8. మీ ఎంట్రీకి చెందిన లింకును ఈ టపాలో కామెంటు రూపంలో పంపాలి. లేకపోతే మీ ఎంట్రీ పరిశీలింప బడటానికి అవకాశం వుండకపోవచ్చు.
9. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి : 2116/- రూపాయలు
రెండవ బహుమతి : 1116/- రూపాయలు
మూడవ బహుమతి : 516/- రూపాయలు.
ఈ బహుమతులను స్పాన్సర్ చేస్తున్న వారు

ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 12-07-2010. త్వరపడండి.
క్రాస్వర్డు పజిలు సాల్వుము -11
ఆధారాలు:
అడ్డం:
1. ఛందోబద్ధమైన కవిత కాదండోయ్!
3. సినిమాల్లో రాజబాబు జోడీ!
5. నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి పేరు తెచ్చిపెట్టిన కథలు.
7. మేక మధ్యన శకుంతలమ్మ!
9. జాతీయ జంతువు.
10. తబ్బిబ్బెగు కోమలి లక్ష్మియా?
11. అభిరామి సిమి గరేవాల్ల జాయింటు సంపద!.
14. అల్లనల్లన అలవోకగా... సుభద్రగారి బ్లాగు కలగాపులగమయింది.
15. నెత్తురు.
16. మాయాబజార్లో ఆర్.నాగేశ్వరరావు ఊతపదం పాక్షికంగా!
నిలువు:
1. తమిళ తమ్ముడికిరువైపులా నిను గలిగిన స్త్రీ.
2. నిగనిగ కాంతులు మెఱయగ
4. గంగానదిని ఇలా పిలువవచ్చా!
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము!
5. కృష్ణభగవానునికీ, క్రీస్తు ప్రభువుకీ ఉమ్మడి విశేషణము!
6. గార్ధభాశ్వములు. ఒకే జాతివి కదా!
7. జూన్ ముందు మొదలయిన శ్రేష్ఠము!
8. లేమికి వ్యతిరేకం!కావడి కుండల్లో ఒకటి!
9. నాల్గు నెలల పూనిక సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు చేపట్టేది!
12. అడ్డం ఐదు రచయితదే మరో రచన చివర ఎగిరిపోయింది.
13. మంచి కళాత్మక చలన చిత్రాన్ని దీనితో పోల్చవచ్చు.
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
12, జూన్ 2010, శనివారం
కథాజగత్‌లో 100వ కథ!
కొండేపూడి నిర్మల గారి కథ ప్రేమ జిల్లాలు కథాజగత్‌లో ప్రకటించాము. దీనితో కథాజగత్‌లో కథల సంఖ్య మూడంకెలకు చేరింది. ఈ సందర్భంగా మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ మాకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తున్న కథా రచయితలకు, పాఠక మహాశయులకు, కథాభిమానులకు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతాభివందనములు. ఇప్పుడు మేము మా లక్ష్య సాధనలో మొదటి ఘట్టంలోనే ఉన్నాము. మున్ముందు మీ ప్రోత్సాహ సహకారాలతో ఈ కథాజగత్ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని మా నమ్మకం. ఈ కథాజగత్‌లో ప్రకటించడానికి కథలను పంపవలసిందిగా ఈ సందర్భంగా కథకులైన బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ మీ కథలను యూనీ కోడ్‌లో (ఇంతవరకూ అంతర్జాలంలో ప్రకటింపబడని కథలను) పంపి మా ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాము.
Labels:
katha jagat
11, జూన్ 2010, శుక్రవారం
10, జూన్ 2010, గురువారం
కొడిగట్టరాని చిరుదీపాలు
అంబికా అనంత్ గారి కథానిక కొడిగట్టరాని చిరుదీపాలు కధాజగత్లో చదవండి.
Labels:
katha jagat
9, జూన్ 2010, బుధవారం
6, జూన్ 2010, ఆదివారం
పుస్తక సమీక్ష -17 ద్రౌపది - తెలుగింటి ఆడపడుచు
[పుస్తకం పేరు: మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది, రచన: డాII ఎం.వి.రమణారెడ్డి, వెల: రూ.100/-, ప్రతులకు: డాII ఎం.వి.రమణారెడ్డి, రాయవరం, ఖాదరాబాదు (పోస్టు), ప్రొద్దుటూరు - 516362 కడప జిల్లా ఫోన్. నెం. 08564 - 251133 ]
కవిత్రయం మనకందించిన మహాభారతం ప్రతి తెలుగువాడి మనసును విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎంతగా అంటే ఈ భారత కథ మన తెలుగుదేశం నడిబొడ్డులో జరిగిందనే భ్రమను కలిగించేటంతగా. సంస్కృత మూలంనుండి సారాంశాన్ని గ్రహించి రకరకాల మార్పులు చేర్పులతో మన తెలుగు వాతావరణానికి అనుకూలంగా కవిత్రయం అనువదించిన ఆంధ్ర మహాబారతాన్ని ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త కావ్యం చదివినట్టే వుంటుంది.
డాII రమణారెడ్డిగారు భారతంలోని ద్రౌపది పాత్రను కవిత్రయం తెలుగుదనం మూర్తీభవించిన విధంగా చిత్రించిన వైనాన్ని విశ్లేషిస్తూ రాసిన పుస్తకమిది. నన్నయ, తిక్కన, ఎర్రనల అనువాదంలో ఉన్న తేడాలను, వారి అభిరుచులను, వారి ప్రణాళికలను, వారి ప్రాధాన్యతలను, వారి సంకల్పాలను రమణారెడ్డిగారు ఈ పుస్తకంలో చక్కగా విడమర్చి చూపిస్తున్నారు. నన్నయ దృష్టి పాత్రల రూపకల్పన కంటే వైదిక ధర్మ ప్రచారాల మీద ఎక్కువ వుండటం వల్ల ఈయన సృష్టించిన పాత్రల లక్షణాలు సంస్కృత భారతంలోని పాత్రలకు భిన్నంగా కనిపించవని రచయిత అభిప్రాయ పడుతున్నారు. అయితే తిక్కన అభిమతం రచనలో తెలుగుదనం చొప్పించడం. "తెలుగు మాటలు ఉపయోగించినంత మాత్రాన తెలుగుదనం సమకూరదు. కూర్పుకు తెలుగు ’నుడికారం’ జతపడాలి; పాత్రలకు తెలుగు నడవడిక నేర్పించాలి. అందుకు తిక్కన ఎన్నుకున్నవి స్త్రీ పాత్రలు. కథానాయిక అయినందున ద్రౌపది ఆయన ప్రయత్నానికి తగిన ముడిసరుకు. తిక్కన ద్వారా జరిగిన సాంస్కృతిక సమ్మేళనము కారణంగా, ప్రతి తెలుగు మనసు భారతాన్ని సొంతం చేసుకుంది. అదేదో తన ఇంటిపట్టున జరిగిన కథగా భావించింది. ఎక్కడో యమునానది తీరంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామాన్ని పెన్నానది తిన్నెలమీద జరిగినంత దగ్గరికి తీసుకొచ్చిన ప్రతిభ తిక్కన బ్రహ్మది." "ఎర్రాప్రగడ తన సొంత అభిప్రాయాలను పక్కకునెట్టి నన్నయ శైలిలోనే భారతాన్ని సంపూర్ణం చేయాలని ప్రయత్నించినా తిక్కన ప్రభావం నుండి తప్పించుకోవడం ఆయనకు సాధ్యం కాలేదని హావభావ ప్రకటనల్లో ఎర్రన పాత్రలు అనుసరించే విధానమే చాటుతుంది" అని తీర్మానిస్తున్నారు.
తిక్కన, నన్నయ అనువాద రీతుల్లో గల తేడాను పరిశీలిస్తూ రచయిత తిక్కన వైపే మొగ్గు చూపిస్తున్నారు. "ఇతర విషయాల్లో ఎన్నోచోట్ల మూలాన్ని వదిలేసి స్వతంత్రించిన నన్నయ స్త్రీపాత్రల చిత్రీకరణలో మాత్రం వ్యాసుని పంథానే అనుసరించాడు. అందుకే అరణ్యపర్వంలో ద్రౌపది ధర్మరాజుతో జరిపిన సంవాదంలో స్త్రీపాత్రకు సంక్రమించిన స్వేచ్ఛ ప్రతిబింబించినా గడుసుదనం కొరవడింది" అని అభిప్రాయపడుతూ, "భావాన్ని ప్రకటించే తీరులో నన్నయ ద్రౌపది కేవలం ఒక హరికథకురాలిగా కనిపిస్తుంది" అంటారు. అదే విరాటపర్వంలో కీచకుడు అవమానించిన రాత్రి భీమసేనునితో సంభాషించిన సందర్భంలో "...ఇక్కడ కూడా ద్రౌపదికి కష్టం కలిగింది; ఆ కష్టాన్ని రోదిస్తూనే తన భర్తతో చెబుతూ వుంది; ఇప్పుడు కూడా భర్తను ఒక కర్తవ్యానికి ప్రేరేపించడమే ఆమె ధ్యేయం. ఐనా, ఉద్రేకాన్ని వెళ్ళగక్కేతీరులో, ఆడ హరిదాసులా కాకుండా అచ్చం తెలుగింటి ఆడబిడ్డలా కనిపిస్తుంది తిక్కన ద్రౌపది" అని నిర్ధారణకు వస్తున్నారు. "తెలుగు భాషకు నన్నయ కావ్యగౌరవం కలిగించగా, తిక్కన దానికి సాహిత్య సామర్థ్యాన్ని ప్రసాదించాడు" అనేది రమణారెడ్డిగారి గట్టి నమ్మకం.
ఇక ద్రౌపది పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ పుస్తకాన్ని వ్రాసినా మొత్తం మహాభారత కావ్యాన్ని రచయిత తమదైన పంథాలో విశ్లేషిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆయా పాత్రలు ప్రవర్తించేతీరు, పలికేపలుకులు ఆవిధంగానే ప్రవర్తించడానికి లేదా పలకడానికి వెనుక ఉన్న కారణాలను రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర మహాభారతంలో విస్తృతమైన రాజకీయ భూమిక వుండటం ఈ రచయిత కూడా రాజకీయవేత్త కావడం వల్ల పాఠకులకు భారతాన్ని ఒక కొత్తకోణంలో పరిచయం కలిగిస్తున్నది ఈ పుస్తకం.
ఇటీవలి కాలంలో ద్రౌపది పాత్రపై జరిగిన రచ్చ నేపథ్యంలో ఈ తెలుగు ద్రౌపదిని శీలపరీక్షకు పాఠకుల ముందు నిలబెట్టనందుకు రచయితను అభినందించాలి.

review
3, జూన్ 2010, గురువారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 10 సమాధానాలు!
అడ్డం:
1. నవరస అయితే కైకాల. విశ్వవిఖ్యాత అయితే నందమూరి. - నటసార్వభౌమ
3. పోtown! గుడికి సంబంధించింది. - గోపురము (Goపురము)
5.బ్రీఫ్ ఇంట్రో! - సంక్షిప్త పరిచయం
7. నాయీబ్రాహ్మణుడు ప్రసాదించే వరం! - క్షవరం
9. అన్నమయ్య, క్షేత్రయ్యల కోవకు చెందిన ఒక వాగ్గేయకారుడు. - సారంగపాణి
10. నవగోతములో చొప్పడియున్న పొగరు. - గోవతనము
11. రా మరదలా అంటున్న విశ్వబ్రాహ్మణుడు. - కంసాలి (come सालि)
14. చందాలు వసూలు చేసే వారి హస్త భూషణము కుడి నుంచి. - ముకస్తపు దుసీర
15. శుభకార్యాలకు పెట్టేది? - ముహూర్తము
16. మొఘలుల కాలంలో మన దేశానికి దిగుమతి అయిన ఈ తీపి మిఠాయి కావాలంటే మూను జాబ్ లాగు. - గులాబ్ జామూను
నిలువు:
1. క్షుల్లకము/ శంఖనఖము - నత్తగుల్ల
2. పడమర వస్తున్న మోటారు బోటు. - మరపడవ
4. మూడు రంగుల మృగశ్రేష్ఠము! - మువ్వన్నె మెకము
5.కాంపోజిట్ మ్యాథ్స్! - సంయుక్త గణితము
6.ఇవి తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ స్టేట్మెంట్! కాకపోతే ఏక వచనంలో! - యంత్ర భూతపు కోర
7. సాధారణంగా ఆవేశం నిడివి. - °µgºOµA
8. కాస్త నాజుగ్గా అయితే రంగవల్లికే! - ±µASÐw
9. లోకవిదితము, జనసాధారణము, బహిరంగము.(?) - «¸±µöYo¶m¶¢ÀÀ
12. తంతునాభము - సాలెపురుగు
13. ధూమశకట వాహన గమనాగమన నిర్దేశ సూచికా స్తంభము. - రెక్కమాను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)