...

...

13, జూన్ 2010, ఆదివారం

తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ!

          తెలుగు కథ శతవార్షికొత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 100 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా కథజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను ఇక్కడ కామెంటు రూపంలో ఇవ్వడమే. వచ్చిన ఎంట్రీలలో  ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నాము.

          ఈ పోటీ 13 జూన్ 2010 నుండి 12 జులై 2010 వరకు వుంటుంది.  12-07-2010 సాయంత్రం 6.00గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది.


నియమ నిబంధనలు:

1. మీ విశ్లేషణను మీ బ్లాగులోనే టపా రూపంలో ప్రకటించాలి. మీ ఎంట్రీలో కథ పేరు కథా రచయిత పేరు స్పష్టంగా పేర్కొనాలి. ఆ కథకు చెందిన లింకును కూడా మీ టపాలో తప్పనిసరిగా ఇవ్వాలి.

2. మీ విశ్లేషణ సుమారు 200 - 500 పదాల మధ్య వుండాలి.

3. మీ టపా సాధ్యమైనంత వరకూ మీరు విశ్లేషించబోయే కథకు పరిమితమై వుండాలి. వ్యక్తిగతంగా ఎవరనీ కించపరిచేదిగా వుండరాదు. అలాంటి ఎంట్రీలు పోటికి పరిశీలింపబడవు.

4. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా విశ్లేషించ వచ్చు. అయితే ప్రతి కథను విడివిడిగా విశ్లేషించి విడివిడి టపాల్లో పెట్టాలి.

5. ఈ పోటీగురించి మీ బ్లాగులో ప్రకటించ వచ్చు కానీ అది కంపల్సరీ మాత్రం కాదు.

6. ఈ పోటీ వున్నంత కాలం, మరియూ ఫలితాలు ప్రకటించే వరకూ మీ ఎంట్రీలను మీ బ్లాగునుండి డిలిట్ చేయరాదు.

7. మీ ఎంట్రీలలోని కంటెంట్‌ను తురుపుముక్కలోగానీ, కథాజగత్‌లో కానీ లేదా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉపయోగించుకునే( ఆ రచయితకు క్రెడిట్ యిస్తూ) హక్కు మాకు వుంటుంది.

8. మీ ఎంట్రీకి చెందిన లింకును ఈ టపాలో కామెంటు రూపంలో పంపాలి. లేకపోతే మీ ఎంట్రీ పరిశీలింప బడటానికి అవకాశం వుండకపోవచ్చు.

9. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.  


బహుమతుల వివరాలు:

మొదటి బహుమతి : 2116/- రూపాయలు

రెండవ బహుమతి : 1116/- రూపాయలు

మూడవ బహుమతి : 516/- రూపాయలు.

ఈ బహుమతులను స్పాన్సర్ చేస్తున్న వారు




  
ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 12-07-2010. త్వరపడండి.

33 కామెంట్‌లు:

మాలతి చెప్పారు...

బాగుందండీ. మంచి ఆలోచన. నందకథలు పోగు చేసిన సందర్భంలోనూ, మీ ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిస్తూను .
- మాలతి

sateesh చెప్పారు...

i am sateeesh :
good manchi aalochana. chala bagundi. anta cliarga undi

జ్యోతి చెప్పారు...

నేను మొదటి కధావిశ్లేషణ రాసాను చూడండి..

http://jyothivalaboju.blogspot.com/2010/06/blog-post_25.html

శ్రీలలిత చెప్పారు...

నిడదవోలు మాలతిగారు వ్రాసిన "రంగు తోలు" కథపై నేను వ్రాసిన సమీక్షను ఈ క్రింది లింక్ లో పంపుతున్నాను. దయచేసి పరిశీలించగలరు.
శ్రీలలిత.
http://srilalitaa.blogspot.com/

శ్రీలలిత చెప్పారు...

అబ్బూరి ఛాయాదేవిగారు వ్రాసిన "భారం " కథపై సమీక్ష.
ఈ క్రింద లింక్ లో చూడవచ్చు.
http://srilalitaa.blogspot.com/2010/06/blog-post_29.html

శ్రీలలిత చెప్పారు...

నిడదవోలు మాలతిగారు వ్రాసిన "రంగుతోలు " కథపై సమీక్షకు ఈ క్రింద సరియైన లింక్ యిస్తున్నాను.
http://turupumukka.blogspot.com/2010/06/blog-post_13.html

కొత్త పాళీ చెప్పారు...

excellent idea.

ఇప్పటిదాకా జ్యోతిగారూ శ్రీలలితగారూ మాత్రమే రాసినట్లున్నారు.
మరికొందరుకూడా ఆసక్తికరమైఅన్ సమీక్షలు రాస్తారని ఆశిద్దాం.

prasoon చెప్పారు...

ఆఖరులో ప్రచురించడానికి ఆగినట్టు ఉన్నారు అందరూ ...:):)
తొందరగా రాసేస్తే చదవాలని ఉంది.
అన్నట్టూ..తురుపుముక్క గారూ..బహుమతి నగదు రూపంలోనేనా..లేదంటే..?

Manjusha kotamraju చెప్పారు...

మా బాదం చెట్టు-మల్లాది వెంకట క్రిష్న మూర్తి గారు రాసిన కధ కు నా భావాలు రాసాను ఒకసారి వీక్షించండి.
http://nenu-naa-prapancham.blogspot.com/2010/07/blog-post.html

శ్రీలలిత చెప్పారు...

వారణాసి నాగలక్ష్మిగారి "మానవ ప్రయాణం" కథ పై నేను వ్రాసిన సమీక్షను ఈ క్రింద లింక్ లో చూడగలరు.
http://srilalitaa.blogspot.com/2010/07/blog-post.html

mmkodihalli చెప్పారు...

prasoon గారి సందేహానికి సమాధానంగా ఈ వివరణ ఇవ్వవలసి వస్తోంది. బహుమతి నగదు రూపంలోనే ఇవ్వబడుతుంది. ఒకవేళ ఎవరైనా విదేశీ బ్లాగర్లకు బహుమతి వస్తే వారికి paypal ద్వారా లేక western union ద్వారా లేదా ఇండియాలో వారు చెప్పిన అకౌంటుకు బహుమతి మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది.

mmkodihalli చెప్పారు...

పైన ’విదేశీ బ్లాగర్లకు’ అనే పదాలకు బదులుగా ’విదేశాల్లో ఉన్న మన బ్లాగర్లకు’ అని చదువుకోగలరు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శ్రీ శ్రీరమణ గారు వ్రాసిన ధనలక్ష్మి కథపై నా అభిప్రాయాలను నా బ్లాగులో చూడండి.

సి.ఉమాదేవి చెప్పారు...

వారణాసి నాగలక్ష్మిగారు రచించిన మానవ ప్రయాణం కథ నన్ను ఆకట్టుకుని ఆలోచింపచేసింది.కథనం,శైలి,శిల్పం వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.నేను ఈ కథపై వ్రాసిన సమీక్షను నేనిచ్చిన లింకులో పరిశీలించమనవి.
http://umadevic.blogspot.com/2010/07/blog-post_05.html

అజ్ఞాత చెప్పారు...

http://umadevic.blogspot.com/2010/07/blog-post_05.html

Rakesh sastri చెప్పారు...

We would like to know who would be judging our articles.
Can we please be given that information ?

Prasoon చెప్పారు...

Thank you very much sir.
Am writing one article too..will submit it soon.

Also, you have given the time to submit the articles. Fine. When will the results be out ?

mmkodihalli చెప్పారు...

రాకేష్ శాస్త్రిగారూ! జడ్జీలు ఎవరో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలండీ.
ప్రసూన్ గారూ! ఫలితాలు గడువు ముగిసిన తర్వాత వీలైనంత త్వరలోనే తెలియజేస్తాం.

అజ్ఞాత చెప్పారు...

కాకాని చక్రపాణి గారు రాసిన సంస్కారం కథ పై విశ్లేషణ రాసాను.
లింక్ :
http://oohalu-oosulu.blogspot.com/2010/07/blog-post_08.html

Unknown చెప్పారు...

నేను శ్రీ రమణ గారి "ధనలక్ష్మి" కధ గురించి రాసిన విశ్లేషణ ఇక్కడ చూడండి.
వేదుల సుభద్ర/praseeda
http://praseeda.wordpress.com/

సి.ఉమాదేవి చెప్పారు...

అడపా చిరంజీవిగారు రచించిన అంతర్ముఖం కథకు విశ్లేషణ రాసాను.పరిశీలించ మనవి.

http://umadevic.blogspot.com/2010/07/blog-post_09.html

psm.lakshmi చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
psm.lakshmi చెప్పారు...

శ్రీమతి అరుణ పప్పు గారి కధ ఏకాంతంతో చివరిదాకా మీద విశ్లేషణ నా బ్లాగు 3psmlakshmi.blogspot.com లో 10-7-10న ప్రచురించాను.
psmlakshmi
3psmlakshmi.blogspot.com

Lakshmi Raghava చెప్పారు...

కథాజగత్ కథ కు విశ్లేషణ
అల్లురి గౌరి లక్ష్మి గారి" స్వయంవరం" అన్న కథపై నా విశ్లేషణ ఈ క్రింద లింకులో చూడ వచ్చు.కథకు చెందిన లింకును తప్పనిసరిగా ఇవ్వాలి అన్నారు..నాకు అలా లింకును ఎలా ఇవ్వలొ తెలియదండి..కథాజగథ్ లో ప్రవేశించానన్న వుచ్చ్హాహం వున్న బామ్మని మాత్రమే..
http://lkamakoti.blogspot.com.
blog pot on 10-7-2010
.

సి.ఉమాదేవి చెప్పారు...

అంబికా అనంత్ గారు రచించిన కొడిగట్టరాని చిరుదీపాలు కథను సమీక్షించాను.చూడగలరని మనవి.

http://umadevic.blogspot.com/2010/07/blog-post_11.html

Unknown చెప్పారు...

కధాజగత్ లో ' నేను సైతం ' అన్న పేరుతో రాసిన రెండు కధలు కనిపించడం, అవి రెండూ ఇంచుమించుగా ఒకే కధా వస్తువూ, ముగింపూ కలిగి ఉండడమూ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక స్థితి లో ఒకటే కధ చదివినట్టు అనిపించడంతో ఒకేచోట విశ్లేషిస్తే అన్న ఆలొచనే ఆ ఈ సమీక్షకి కారణం. ఇది పోటీకి అర్హమా అనర్హమా అనేది మీ నిర్ణయమే. నా ఈ విశ్లేషణ పై మీదీ, న్యాయనిర్ణేతల అభిప్రాయం చెప్పగలిగితే నాకు చాలా సంతోషం.
subhadra vedula/praseeda

Unknown చెప్పారు...

www.praseeda.wordpress.com
పైన నా బ్లాగ్ చిరునామా ఇవ్వడం మర్చిపోయానండి.

durgeswara చెప్పారు...

chaalaa mamchi prayatnam

lakshmi raghava చెప్పారు...

"swayamvaram "kathaku visleshaNa naa bloglo post chesanu.katha liku kuda andulo echchanu.
http://lkamakoti.blogspot.com

జ్యోతి చెప్పారు...

పంతుల జోగారావుగారి ధిక్కార స్వరంపై నా అభిప్రాయాలు..

http://jyothivalaboju.blogspot.com/2010/07/blog-post_12.html

Manasa Chamarthi చెప్పారు...

నిర్వాహకులకు,

కోడూరి శ్రీ రామమూర్తి గారి " తెరతీయగరాదా" కథకు నా విశ్లేషణను ఈ కింద ఇవ్వబడిన చోట చేర్చడమయినది. పరిశీలించగలరు.

http://madhumanasam.blogspot.com/2010/07/blog-post.html

-మానస చామర్తి

Kathi Mahesh Kumar చెప్పారు...

http://parnashaala.blogspot.com/2010/07/blog-post_12.html

జయధీర్ తిరుమలరావు గారి ‘చలం చెప్పని కథ’ పై నా నాలుగు ముక్కలు.

అజ్ఞాత చెప్పారు...

btw, time is only 5:20 IST now.
Why does it show a different time on your blog..?