కవితాకోకిల పత్రిక వారు రాష్ట్ర స్థాయి కవితల పోటీ నిర్వహించి వాటి ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ప్రత్యేక బహుమతి, ప్రోత్సాహక బహుమతి అని అయిదు బహుమతులు ప్రకటించారు. హైదరాబాదు, నాగాయలంక, కడప , చెన్నేకొత్తపల్లి, పిఠాపురం నుండి వచ్చిన కవితలకు బహుమతులు వచ్చాయి. రమణీస్వామినాథన్, జ్ఞానశ్రీ, విశ్వంభర శాస్త్రి, పాలడుగు పరంధామయ్య, రసూల్‌లు ఈ బహుమతులను అందుకున్నారు. పరేషాని, వేదన - రోదన, మనిషిలో మహిషం, భూగోళంలో గందరగోళం, బిళ్ళంగోడు కవితలు ఈ పోటీలో గెలిచాయి. ఈ క్రింది వివరణల ద్వారా ఏయే బహుమతులు ఏయే కవితలకు ప్రకటించారో చెప్పుకోండి. అలాగే ఆ కవితలను ఎవరు వ్రాశారు? ఏ ప్రాంతానికి చెందినవారో? తెలపండి.
'పరేషాని' కవితకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. దానిని వ్రాసింది విశ్వంభర శాస్త్రి. రెండవ బహుమతి జ్ఞానశ్రీ రచించిన కవితకు ప్రకటించారు. అయితే అది 'వేదన - రోదన' కాదు. 'మనిషిలోని మహిషం'కు మూడవ బహుమతి వచ్చింది. ఇది తూ.గో. జిల్లా నుండి వచ్చిన కవిత. రమణీస్వామినాథన్ 'బిళ్ళంగోడు' అనే కవితను వ్రాశారు. అయితే ఈ కవిత అనంతపురం కడప జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడంలేదు. పిఠాపురం నుండి వచ్చిన కవితకు ప్రత్యేక బహుమతి రాలేదు. రసూల్ ఒక కరువు జిల్లాకు చెందినవారయినా అతని కవితకు ప్రత్యేక బహుమతి ఇవ్వలేదు. 'భూగోళంలో గందరగోళం' అనే కవిత హైదరాబాదు నుండి వచ్చింది. 'వేదన - రోదన' అనే కవిత జిల్లా ముఖ్యపట్టణం నుండి రాలేదు.

2 కామెంట్‌లు:
బిళ్ళంగోడు-రమణీస్వామినాథన్- పిఠాపురం-మొదటి బహుమతి.
'భూగోళంలో గందరగోళం'-జ్ఞానశ్రీ-హైదరాబాదు-రెండవ బహుమతి.
మనిషిలోని మహిషం'-రసూల్-కడప-మూడవ బహుమతి.
వేదన - రోదన'-పాలడుగు పరంధామయ్య- నాగాయలంక
-ప్రత్యేక బహుమతి
'పరేషాని'-విశ్వంభర శాస్త్రి-చెన్నేకొత్తపల్లి-ప్రోత్సాహక బహుమతి.
anuగారూ "మనిషిలోని మహిషం కు మూడవ బహుమతి వచ్చింది. ఇది తూ.గో. జిల్లా నుండి వచ్చిన కవిత" ఈ స్టేట్‌మెంట్‌తో మీ సమాధానం సరిపోవడం లేదు. మరోసారి ప్రయత్నించండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి