తీన్మార్, సొంతడబ్బా,ఊరపిచ్చుక, బేవార్స్‌గాడు, వీరముష్టి అనే తెలుగు బ్లాగుల మధ్య పోటీ పెట్టారు. కూడలి, మాలిక, జల్లెడ, హారం, సమూహం సంకలినులు ఇచ్చిన కర్మఫలాల (performance points) ఆధారంగా ఏది ఉత్తమమైన బ్లాగో నిర్ణయిస్తారు. పై సంకలినులు ఆయా బ్లాగుల పాపులారిటీ ఆధారంగా 1 నుండి 5 కర్మ ఫలాలను ఇస్తాయి. ఎక్కువ పాపులర్ అయిన బ్లాగుకు 5 కర్మ ఫలాలు తక్కువ ప్రాచుర్యం పొందిన బ్లాగుకు 1 కర్మ ఫలాన్ని యిస్తాయి అన్నమాట. ఈ విలువలు వారం వారం మారుతూ ఉంటాయి. పై సంకలినులు పైన పేర్కొన్న 5 బ్లాగులలో ఏ రెండింటికీ ఒకేరకమైన కర్మ ఫలాన్ని ఇవ్వలేదు. ప్రతి సంకలని ఇచ్చిన కర్మ ఫలాల మొత్తం ఆధారంగా ఏ బ్లాగు ఉత్తమమైనదో నిర్ణయిస్తారు. తీన్మార్ బ్లాగుకు అత్యధికంగా 24 కర్మఫలాలు లభించాయి. సొంతడబ్బా బ్లాగుకు నాలుగు సంకలినులు ఒకే విధమైన కర్మ ఫలాలను కేటాయించాయి. వీరముష్టి బ్లాగుకు జల్లెడ 5 కర్మఫలాలను, సమూహం 3 కర్మఫలాలను ఇచ్చాయి. ఏ రెండు బ్లాగులకు సమాన మొత్తంలో కర్మఫలాలు రాలేదు. వరుసగా తీన్మార్, ఊరపిచ్చుక, సొంతడబ్బా, బేవార్స్‌గాడు, వీరముష్టి బ్లాగులు ఒకటి నుండి అయిదు స్థానాలలో నిలిచాయి. ఈ వివరాల ఆధారంగా ఊరపిచ్చుక బ్లాగుకు హారం కేటాయించిన కర్మ ఫలాలు ఎన్నో చెప్పగలరా?
3 కామెంట్లు:
:) :)
The answer is 1
మలక్‌పేట రౌడీగారూ! మీ సమాధానం కరెక్ట్ అండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి