...

...

20, ఆగస్టు 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 24




ఆధారాలు: 
అడ్డం: 
1. కావేరీ నది!
3. నారదుడు రాక్షస ముని కాదు!
5. ఎన్‌టీయార్, సావిత్రులను మురిపించిన హిమగిరి సొగసులు ఈ చిత్రరాజంలోనిదే!
7. చొక్కాకు ఉండే మెడ పట్టీయా?
9.  సినిమా తార లకు ఒక హిట్ వస్తే చాలు ఇక వారికి _____ ఉండవు
10. కన్నడలో గోడంబి, తెలుగులో అగ్రబీజము!
11. అటునించి మూల్యము!
14. వెనుదిరిగే పని!
15. డేరా!
16. సత్తి(ఓ మంచి పనోడు) నటించిన తాజా చిత్రం.
నిలువు:
1. దాక్షిణ్యము!
2. దేవర కోటేశు రచయిత పతంజలి శాస్త్రిగారి ఇంటి పేరు!
4. భగవంతునికి అర్పించుకునే ఒకానొక మ్రొక్కు. ఇదే పేరుతో ఒక సినిమా 68లలో వచ్చింది.
5. కృష్ణభగవానుడికి ఇలా పేరు పడిపోయింది పాపం!
6. ఇటీవలే కాలధర్మం చెందిన చేతనావర్త కవి!
7. బతుకు పుస్తకం రాసిన మల్లయ్యగారి ఇంటి పేరు!
8. చిత్రం భళారే విచిత్రం చిత్రంలో నటించిందిరా ఈ జీవి!
9. భద్రగజము!
12. గొప్పగొప్పవారు తలక్రిందలయ్యారు.
13.  6నిలువులోని వారికి సోదరులు!

3 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. కవేరదుహిత; 3. దేవముని; 5. పాండవవనవాసం; 7. కాలరా; 9. పట్టపగ్గాలు; 10. జీడిమామిడి; 11. వలువి; 14. తిరోగమనచర్య; 15. గుడారము; 16. మర్యాదరామన్న
నిలువు -
1. కటాక్షము; 2. తల్లావజ్ఝల; 4. నిలువుదోపిడి; 5. పాండవపక్షపాతి; 6. సంపత్కుమారాచార్య; 7. కాలువ; 8. రాజీవి; 9. పట్టపుటేనుగు; 12. లుహుమహామ; 13. సుప్రసన్న.

కంది శంకరయ్య చెప్పారు...

నిలువు 7 "కాలువ" అని టైపు చేయబోయి పొరపాటున "కాలువు" అని చేసి వ్యాఖ్య పోస్ట్ చేసాను. తప్పు తెలిసికొని దానిని తొలగించి మళ్ళీ పేస్ట్ చేస్తే అదే తప్పు మళ్ళి జరిగింది. దానినీ తొలగించి ముచ్చటగా మూడవసారి సవరించి సరైన కాలువలో పడ్డాను.

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్య గారు అన్నీ సరిగ్గా పూరించారు. మీకు నా అభినందనలు!