...

...

6, ఆగస్టు 2010, శుక్రవారం

కవితాభిషేకం! -32


ఆముక్తమాల్యదా కోమల ప్రౌఢోక్తి
                భావనావీధుల ప్రణయమూని
మనుచరిత్ర రసార్ద్రమంజిమ భావించి
                పారిజాతములోని సౌరుగొంచు
స్తుతమతియైనట్టి ధూర్జటికవినాథు 
                మాధురీమహిమంబు మదిదలంచి
రామరాజ శ్లేష రమణీయ సంగీత 
                విన్యాసలహరిలో వేడ్కదోగి

పింగళి కళా ప్రపూర్ణత రంగరించి
కందుకూర్యష్టకముల విందుగొంచు
రామకృష్ణు పదన్యాస రక్తి దవిలి 
నాటి జన్మంబె కోరు దేనాటికైన

             -ఆశావాది ప్రకాశరావువ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి