...

...

25, ఆగస్టు 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 25









ఆధారాలు: 
అడ్డం: 
1. తెరాస నాయకుల మెడలో ఉండేది ఇదే కదా!
3. ఆచార్య కొలకలూరి ఇనాక్ పేరు చెప్పగానే స్ఫురించే కథ!
5. పవిత్రురాలగు గోదాదేవి ధనుర్మాస వ్రతమును ఆచరించిన మాసము
7. ఏహ్యము, డోకు
9.  ఈ ఆదివారం e-తెలుగు వారు చేపట్టనున్న కార్యక్రమం.
10. శ్రీకృష్ణదేవరాయలవారికి దీనితో పాటుగ కవన కుతూహలం కూడా ఉండేదిట!
11. అతి కానిది నమిత ముక్కులో నక్కినదా?
14. పక్షుల గుంపు చేసే శబ్దమా లేక కలకంఠుల గలగలయా?
15. సూర్యభగవానుడే మన కర్మలకు ప్రత్యక్ష సాక్షి!
16. హిట్లర్ సినిమా దర్శకుడు ఈ అందరివాడు.
నిలువు:
1. కాగజ్ కే ఫూల్ దర్శక నిర్మాత!
2. రామదండు !
4. కందుకూరి వీరేశలింగం పంతులుగారి సంఘసంస్కరణ కార్యక్రమాలలో ఎన్నదగినది.
5. శంకరంబాడి సుందరాచారి వ్రాసిన మన రాష్ట్ర గీతం!
6. సముద్ర తీరంలో సూర్యోదయ దృశ్యము లేదా సూర్యాస్తమయ దృశ్యము ముగ్ధ అనే పేరుగల అమ్మాయి, మనోహర్ అనే అబ్బాయిల ప్రణయకావ్యంలా ఉంటుంది!
7. విజయానికి తొలి మెట్టు!
8. కరములో విధము!
9. నిడదవోలు మాలతి గారి బ్లాగు.
12. జంజాటము వంటిదే!
13.  నారదనారది సినిమా దర్శకులు!


8 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1) గులాబికండువా,3) గృహహింస, 5)మార్గశిరమాసము,7)ఓకర,9)తెలుగుబాట,10కవితానందం,11)మితము, 14) కిలకిలారవము,15) కర్మసాక్షి, 16) ముత్యాలసుబ్బయ్య.
నిలువు:
1)గురుదత్,2) వానరమూక,4)సహవిద్యానందం, 5)మాతెలుగుతల్లికి,6).....7)ఓటమి, 8)రకము,9) తెలుగుతూలిక, 12) తగులాటము, 13) పి.పుల్లయ్య.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ మీ సమాధానాలలో అడ్డం 3, 10, నిలువు 4లు తప్పుగా వ్రాశారు. 14.అడ్డం, 13.నిలువులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డం
10. కవిత దాహం

నిలువు
4. వితంతు వివాహం
6 ముదియ తరంగము
13 సి.పుల్లయ్య

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ నిలువు 4, 13 కరెక్టేనండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

6)నిలువు: ముగ్ధమనోహరము.
10)అడ్డము: కదనోత్సహం.
3)అడ్డం:....

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 3)ఊరబావి.

(అమ్మయ్య! అన్ని వచ్చాయనుకుంటాను))

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ మొత్తానికి అన్నీ సాధించారు:-) అభినందనలు. అడ్డం 10 కదనోత్సాహము త్సకు దీర్ఘం వుండాలి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నిజమేనండి,కాని పూర్తిచేసిన ఆనందంలో "ఆ" కారం ఆవిరి అయిపోయిందనుకుంటాను. బహుశా!