...

...

16, మార్చి 2011, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 40

 


ఆధారాలు:
1.  తెలంగాణా జేయేసీ పల్లెల్లో ఈ పేరుతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది.(4,2)
3. డామిట్! అనౌన్స్‌మెంటు అడ్డం తిరిగింది.(4)
5. ఈ colourful remembrance వంశీ రచనయేనా? (4,3)
7. సుఖము కలిగిన స్త్రీ (3)
9. కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన నవల (5)
10. సింహాసనం, రౌడీ అల్లుడు, స్టేట్ రౌడీ సినిమాలకు సంగీతం కూర్చిన బాలీవుడ్ సంగీతదర్శకుడు.(5)
11. భీరులు యుద్ధము చేయదగరు. ఈ వాక్యంలోని ఆయుధ విశేషము.(3)
14. తన్ను మాలిన ధర్మము , మొదలు చెడ్డ బేరము. ఇలాంటివి ఒకటి కాదు. పెక్కు. తెవికీ ప్రకారం :) (4,3)
15. శివరాజు వెంకట సుబ్బారావు సంతోష్ కుమార్ కాదు (4)
16. రచయితలకు ఆశ పెట్టేది. కొండొకచో భంగ పరచేది. అడపాదడపా తృప్తి నిచ్చేది. (6)
నిలువు:
1. Screen shot.(4)
2. రాశి, కుప్ప, ప్రోగు మధ్యలో కాస్త తేలికగా(5)
4. పులికాట్ సరస్సు (3,3)
5. గుల్జారీలాల్ నందా (4,3)
6. దివిటీలు(7)
7. శశి థరూర్‌ను ఈ మధ్య పెళ్ళి చేసుకున్నది ఈ కాశ్మీరీ మహిళ. (3)
8. ఉర్దూ సమాచారం (3)
9. వైయెస్సార్ కాంగ్రెస్  అ(న)ధికార ప్రతినిధి. (3,3)
12. సహస్రావధాని నరసింహారావుగారి ఇంటిపేరు కాస్త అటుఇటు అయ్యింది(5)
13. పగడాల జాబిలి చూడు - గగనాల దాగెను నేడు అంటున్నారీ సినిమాలో సినారె.(4)

4 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1)....... 3) నటకప్ర(ప్రకటన), 5) ఆకుపచ్చజ్ఞాపకం, 7) సుముఖ, 9) అంతర్మధనం, 10) బప్పిలహిరి, 11) దగరు, 14) నిప్పులాంటినిజాలు, 15) బుచ్చిబాబు, 16) కధాపఠనము.
నిలువు: 1) తెరచిత్రం, 2) సముచ్చయము, 4) ప్రళయకావేరి, 5) ఆపధర్మప్రధాని, 6) కంఠనీలకములు, 7) సునంద, 8) ఖబరు,9) అంబటిరాంబాబు, 12) గరిటిపాక(గరికపాటి), 13) మూగనోము.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నిలువు: 1) తెరపట్టు

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ! మీరు పంపిన వాటిలో అడ్డం 10,16,నిలువు 5,12 మినహా మిగిలినవి కరెక్టేనండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నిలువు 5
ఆపధ్ధర్మ ప్రధాని