...

...

23, మార్చి 2011, బుధవారం

మెదడుకు మేత!- 6

విభ స్ఫూర్తి ఇద్దరూ బాల్య స్నేహితులు. ఇరవై యేళ్ళ తరువాత అనుకోకుండా ఒక హోటల్ గదిలో కలుసుకుంటారు.

విభ : మనం కలిసి చాలా రోజులయ్యింది. ఏమిటి విశేషాలు?

స్ఫూర్తి : నాకు పెళ్ళయ్యింది. ముగ్గురు అమ్మాయిలు.

విభ : అలాగా. ఎంత వయస్సేమిటి?

స్ఫూర్తి : వాళ్ళ వయస్సులను హెచ్చవేస్తే 72 వస్తుంది. కూడితే వచ్చే సంఖ్య ఈ గది సంఖ్య ఒకటే.

విభ : నీవిచ్చిన సమాచారంతో వాళ్ళ వయసులను కనుక్కోలేక పోతున్నానే స్ఫూర్తీ.

స్ఫూర్తి : అన్నట్టు చెప్పడం మరిచి పోయాను. మా పెద్దమ్మాయి పాటలు చక్కగా పాడుతుంది తెలుసా?

విభ : అలాగా మా అమ్మాయి కూడా సరిగ్గా మీ పెద్దమ్మాయి వయస్సేనే.

పై సంభాషణ ద్వారా స్ఫూర్తి కూతుళ్ళ వయస్సు కనిపెట్టగలరా?

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

3yrs,4 yrs,6yrs.
పెద్ద అమ్మాయి వయసు ఆరు సంవత్సరాలు.

mmkodihalli చెప్పారు...

anu గారూ మీ సమాధానానికి వివరణ ఇవ్వగలరా? ఆ అమ్మాయిల వయస్సులు 3,4,6 సంవత్సరాలే ఎందుకు అవుతాయి? 1,8,9 లేదా 2,4,9 లేదా 2,3,12 లేదా 1,6,12 సంవత్సరాలు కావచ్చు కదా?