...

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం
29, సెప్టెంబర్ 2011, గురువారం
28, సెప్టెంబర్ 2011, బుధవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 50
ఆధారాలు:
అడ్డం:
1. అడవి బాలకి కాదు వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలా మందే
ఉన్నారు (4)
3. నిలువు 13లోని వాడే (4)
5. విశాఖ ___ ఆంధ్రుల హక్కు! ఈ
నినాదం అప్పట్లో మార్మ్రోగింది (2)
6. కలరవంలో వక్రత (3)
7. అటునుంచి చివర (2)
9.
దీని సంగతి ఊరి సుద్దుల్లోనే
వుంది (2)
1 1. పుష్కరాలలో గంగా నది (2)
13. జ్వాలాముఖి + మహాస్వప్న (4, 3)
15. వెనుక నుంచి సెగ పుట్టిందా? (2)
17. జాబిలితో సానుభూతి (2)
18. పారుపత్తెపు బడి (5)
19. ఇది దొరికింది గుర్రాన్ని కొన్నాడట వెనకటికి ఒకడు (2)
20. పాతాళభైరవిలోని కంపు (2)
22. విలుకాడు పెద్దలకు ఇది వదలుతాడు. కనీసం సినిమాల్లో (4, 3)
24. పరమశివుడు గరళం ఇక్కడే ఉంచుకున్నాడు (2)
25. ఇది ఎత్తుకోవడం మా హక్కు అని నిలువు 23 ఎత్తుతున్నారు యాచకులు (2)
26. దయచేయండి (2)
28. కిలాడి బుల్లెమ్మ ధరించిన నాసికాభరణము (3)
30. మీకు అస్సలు కాదు. మందు తోడిది (2)
31. ఆ ఏముంది సింగినాదం ____ (4)
32. కీరా (4)
నిలువు:
1. అగ్రభుక్కు
ఆద్యంతాలతో ఱొమ్ము (2)
2. నెలవంకలో హారం
కానిది (2)
3. అడ్డం 3లోని వాడే (2)
4. చొక్కా విప్పిన
అంగీరస (2)
5. కడుపులో సంపదను
దాచుకున్న తిష్యఫలము (4)
8. సుత్తితో
జతకలిపితే సి.పి.ఎం, కంకితో జతకలిపితే
సి.పి.ఐ (4)
9. ఊరుకున్న
శంఖాన్ని __ చెడగొట్టినట్లు
అని సామెత. (2)
10. మల్లెపూలు
వెదజల్లేది సుధ గంప మధ్యన నారికేళం లో వెతకండి (3, 4)
11. కుసుమాంగుల
కూటమి (4, 3)
12. తలలేని వరాలు (2)
14. ఎటునుండి ఐనా
మన్మథుడే (5)
16. వగకాడా దివిటీ
పట్టుకో (3)
17. లిస్టు (3)
19. తోచిన విషయాల
గురించి తోచిన విధంగా చెప్పే బ్లాగు (4)
21. బంతికే
రావద్దంటే ____ తెమ్మన్నట్లు (4)
22. నగరంలో భూషణం. (2)
23. అడ్డం 25 ఎత్తుకోవడం
మా హక్కు అని ఇది ఎత్తుతున్నారు యాచకులు (2)
27. జీవనాడి నావ
మునిగిపోయి బోల్తా కొట్టింది (2)
28. తలపుచ్చె (2)
29. నేలను
క్రిందనుండి చెక్కి (అ.క్రి.) (2)
30. ఏ __ చేసావే నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక సినిమా (2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
27, సెప్టెంబర్ 2011, మంగళవారం
26, సెప్టెంబర్ 2011, సోమవారం
జ్యోతి ముచ్చట్లు!
అలనాటి పత్రికలు శీర్షికన కొన్ని పాత పత్రికల ముఖపత్రాలను మీతో పంచుకోవాలనుకున్నాను. అయితే పంతుల జోగారావు గారి సూచన మేరకు అప్పుడప్పుడు ఆయా పత్రికల గురించి నాకు తెలిసిన విశేషాలను మీతో పంచుకుంటాను. నేను చిన్నప్పుడు ఎక్కువగా అభిమానించిన పత్రిక జ్యోతి మాసపత్రిక. ఇది 1962 ఆ ప్రాంతాలలో విజయవాడనుండి వెలువడటం ప్రారంభించింది. వి.వి.రాఘవయ్యగారు ఈ పత్రికను నడిపేవారు. కొంతకాలానికి ఈ పత్రిక మద్రాసుకు తరలి పోయింది. వి.వి.రాఘవయ్య చనిపోయిన తర్వాత ఆయన శ్రీమతి లీలావతి రాఘవయ్య సుమారు 2 దశాబ్దాలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ పత్రికను నడిపారు. అందమైన ముఖచిత్రంతో వెలువడే ఈ పత్రిక ప్రతి నెలా ఒక నవలానుబంధం ప్రచురించేది. ఈ పత్రిక ద్వారా లబ్ద ప్రతిష్టులైన ఎందరో రచయితల రచనలు వెలుగు చూశాయి. రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, కేతు విశ్వనాథ రెడ్డి, కోరుకొండ సత్యానంద్, లల్లాదేవి, మల్లాది వెంకటకృష్ణ మూర్తి, యండమూరి వీరేంద్ర నాథ్, భమిడిపాటి రామగోపాలం, హితశ్రీ, మధురాంతకం రాజారాం, అవసరాల రామకృష్ణారావు, ఆదివిష్ణు, ఎన్.ఆర్.నంది, ద్వివేదుల విశాలాక్షి, దాశరథి, కె.రామలక్ష్మి, నారాయణరెడ్డి, వరవరరావు మచ్చుకు కొన్నిపేర్లు. ఆ తర్వాత కొన్ని రోజులు హైదరాబాదు నుండి వెలువడేది.
ఈ పత్రికలో నాకు చాలా బాగా నచ్చిన శీర్షిక శ్రీశ్రీ నిర్వహించిన పదబంధ ప్రహేళిక. 1976 నుండి 1983 వరకూ ఈ శీర్షికను శ్రీశ్రీ చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. తర్వాత కొన్నాళ్ళు ఆరుద్ర గళ్ళనుడికట్టు పేరుతో ఈ పత్రికలోనే పజిల్‌ను నిర్వహించాడు.
ఈ రెండు శీర్షికలూ అప్పట్లో పాఠకుల అభిమానాన్ని చూరగొంది. శ్రీశ్రీ పదబంధ ప్రహేళికను చూసి ఈర్ష్య పడి విమర్శించేవారు అప్పట్లో ఎక్కువ మందే ఉండేవారు. యామిజాల పద్మనాభస్వామి గారి విమర్శకు శ్రీశ్రీ ఘాటైన సమాధానమే చెప్పారు ఓ సంచికలో.
1990 ప్రాంతాల్లో (సరిగ్గా తెలియదు) ఈ పత్రిక మూతపడినట్టు గుర్తు. దాట్ల నారాయణమూర్తి రాజు కొన్నాళ్ళు సంపాదకుడిగా ఉన్నట్టు జ్ఞాపకం.


1990 ప్రాంతాల్లో (సరిగ్గా తెలియదు) ఈ పత్రిక మూతపడినట్టు గుర్తు. దాట్ల నారాయణమూర్తి రాజు కొన్నాళ్ళు సంపాదకుడిగా ఉన్నట్టు జ్ఞాపకం.
25, సెప్టెంబర్ 2011, ఆదివారం
మనసున మనసై
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ కథా రచయిత కలువకొలను సదానంద గారి కథ తోడొకరుండిన అదే స్వర్గము కథాజగత్‌లో చదవండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1990లో నిర్వహించిన జన్మదిన సంచిక కథల పోటీలో మొదటి బహుమతిని గెలుచుకుంది.
23, సెప్టెంబర్ 2011, శుక్రవారం
22, సెప్టెంబర్ 2011, గురువారం
21, సెప్టెంబర్ 2011, బుధవారం
20, సెప్టెంబర్ 2011, మంగళవారం
నో లాంగ్ బెల్ ప్లీజ్
డి.రామచంద్ర రాజుగారి కథ నో లాంగ్ బెల్ ప్లీజ్ కథాజగత్‌లో చదవండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి.
19, సెప్టెంబర్ 2011, సోమవారం
18, సెప్టెంబర్ 2011, ఆదివారం
ఎవరు బాధ్యులు?
పర్యావరణ సాహిత్యోద్యమంలో భాగంగా జాగృతి కిరణ్ ఫౌండేషన్ (నాగపూర్) సహకారంతో కథాకేళి పత్రిక వారు నిర్వహించిన "హరితకథ -2009" పోటీల్లో బహుమతి గెలుచుకున్న ఎం.వెంకటేశ్వరరావు గారి కథ "ఎవరు బాధ్యులు?" కథాజగత్‌లో చదవండి.
17, సెప్టెంబర్ 2011, శనివారం
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
రండి... మళ్ళీ పుడదాం
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిగారి కథ రండి... మళ్ళీ పుడదాం కథాజగత్‌లో చదివి మీ అభిప్రాయం చెప్పండి.
15, సెప్టెంబర్ 2011, గురువారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 49
ఆధారాలు:
అడ్డం:
1. అడవి బాలకి కాదు
వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలామందే ఉన్నారు (4)
3. సదాను పోలిన నటి (పేరులో) వెనుదిరిగింది
(2)
7. అబద్ధము కానిది అటునుంచి (2)
8. ఎక్కడికి? లిటరరీ మీటింగుల కే నా? (3, 4)
1 0. బాపినీడు నడిపిన ఓ పత్రిక గజిబిజి అయ్యింది
(3)
12. సర్వసాధారణమైన విషయం కాబట్టే తడబడింది (11)
13. అటునుంచి దగ్గు (3)
14. భారతీయుడు సినిమాలో కథానాయిక (3, 4)
15. పానము లేని పానపాత్రము వెనుకనుంచి (2)
17. పేరాశలో విషయ పరిచ్ఛేదము (2)
18. తి. తి. దే తాజా మాజీ ఛైర్మన్గారు కొంచెం తడబడ్డారు
పాపం (11)
నిలువు:
1. గలివర్ ట్రావెల్స్
మాతృక అనదగిన మొదటి తెలుగు నవల. పంతులుగారిది (4,
4,
3)
2. హాని కలిగించడానికి
ఇది విషం కాదు కదా! అమృతం లాంటి తేనె (2)
3. పెరుగుట విరుగుట కొఱకే ధర తగ్గుట
హెచ్చుట కొఱకె జాబితాలో మొదటిది. మొదట్లోనే కాస్త తత్తరపడింది (4, 4, 3)
4. జంఘాల శాస్త్రిగారి
పిక్క ఒకటి తలక్రిందలయ్యింది J (2)
5. కాంతం కథల యతిపద్మరాగమానవకంఠీరవ
రావుగారు J (5, 6)
8. జనాదరణ పొందిన ఈలపాట
రఘురామయ్య గారి శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా పాట. చివరలో హ్రస్వమే
(3, 4)
9. రాజ్యాంగ న్యాయశాస్త్రము
ఆంగ్లంలో (6, 1)
10. మొదటి రెండు వదలి
పారాయణము చేయుము (3)
11. కింగ్స్ టన్
రాజధానిగా గల ద్వీపము (3)
16. పాడియావు ధర్మాన్ని
చూపుతుందా? ( 2)
17. దారము పేను
(2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
11, సెప్టెంబర్ 2011, ఆదివారం
10, సెప్టెంబర్ 2011, శనివారం
నువ్వేనేను, నేనేనువ్వు
పులిగడ్డ విశ్వనాథరావు గారి కథ నువ్వే నేను, నేనే నువ్వు కథాజగత్‌లో చదవండి. ఈ కథపై బాపుగారి ప్రశంస ఇంతకు ముందు టపాలో చదివారు కదా! ఇప్పుడు ఈ కథపై ప్రఖ్యాత రచయిత మంజుశ్రీ(అక్కిరాజు రమాపతిరావు)గారి అభిప్రాయం ఇక్కడ చదవండి.
"కథకు ఏది ఆయువు పట్టో, ఏది ప్రాణమో మీకు బాగా తెలుసునని ఈ కథ ద్వారా నాకు తెలిసింది. చాలా ఆర్ద్రతతో మీరు రాశారు. చదివిన వాళ్ళకు కూడా ఆ స్పందన స్పర్శ అనుభూతినిస్తుంది. మాటకారి తనానికీ, కారుణ్య రస ఆత్మావలోకానికీ సాధారణంగా పొందిక ఉండదు. ఆ పొందిక కూర్చడం కష్టం. కథ కొసకంటా వచ్చేసరికి కళ్ళు చెమరింపచేయగలగడం సామాన్యం కాదు. అసామాన్యమే. మీరీ కథలో ఒక కొత్త సొగసును చూపారు. తెచ్చారు. ఒక కొత్త శిల్పం - ఒక కొత్త బాణీ - కొత్త వస్తువు - కొత్త కథనం. అన్నీ బాగున్నాయి. కథా రచనలో ఒక సంభ్రమాన్ని చివరిదాకా పోషించారు. మానవజీవితాన్ని ప్రేమించడం నేర్పడమే కథ అత్యంత విశిష్ట ప్రయోజనం. జీవితం పట్ల ఆశనూ, ఆశ్వాసాన్నీ మప్పడంకన్న సాహిత్యానికి సార్థకత ఏముంది? ఏముంటుంది?"
మరి మంజుశ్రీగారి అభిప్రాయంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో ఈకథ చదివి నిర్ణయించుకోండి.
9, సెప్టెంబర్ 2011, శుక్రవారం
ముద్దుకృష్ణ
వైతాళికులు కవితా సంకలనకర్తగా పేరుగడించిన ముద్దుకృష్ణ 1933లో జ్వాల అనే పత్రికను నడిపారు. మూఢవిశ్వాసాలతో ఉన్న ఆనాటి సమాజాన్ని ఒక్క సారిగా ఊపివేసి, యువకుల్లో స్వతంత్రమైన ఆలోచనా శక్తికి దోహదం చేసిన ఆనాటి తెలుగు పత్రికలలో జ్వాల ఒకటి. ఎక్కువ కాలం ఈ పత్రిక వెలువడకపోయినా ఆ కాలంలో సంచలనాన్ని సృష్టించింది. ముద్దుకృష్ణ గారు ఇంకా అశోకం, టీకప్పులో తుఫాను, భీమా విలాపంలో భామా కలాపం మొదలైన నాటికలు వ్రాసి ప్రదర్శించారు.
8, సెప్టెంబర్ 2011, గురువారం
7, సెప్టెంబర్ 2011, బుధవారం
6, సెప్టెంబర్ 2011, మంగళవారం
5, సెప్టెంబర్ 2011, సోమవారం
ఇండియన్ హెర్క్యులస్
వీరిని గుర్తించగలరా? అని నేను ఇచ్చిన ఫోటోలోని వ్యక్తి కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ మరియు ఇండియన్ హెర్క్యులస్ ఇత్యాది బిరుదులను కలిగిన కోడి రామ్మూర్తి నాయుడు గారు. చిలమకూరు విజయమోహన్ గారు వీరిని గుర్తించగలిగారు. వారికి నా అభినందనలు!
4, సెప్టెంబర్ 2011, ఆదివారం
2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
బాపు మెచ్చిన కథ!
"వృత్తి రీత్యా అనేక కథలు చదివిన నాకు ఈ కథ ఎంతో ప్రత్యేకంగానూ మిక్కిలి విలక్షణంగానూ (తెలుగులో unique ) అనిపించింది" అని ప్రముఖ చిత్రకారుడు బాపుగారిచే ప్రశంసలందుకున్న ఒక కథను అతి త్వరలో కథాజగత్‌లో అందిస్తున్నాము. ఆ కథ త్వరలో రాబోయే ఈ క్రింది కథల్లో ఒకటి.
1. ఎవరు బాధ్యులు - ఎం.వెంకటేశ్వరరావు
2. కల కానిది- విలువైనది - కె.వరలక్ష్మి
3. అమ్మ కొడుకు - టి.శ్రీరంగస్వామి
4. పండుగా నీకు జోహార్ - అయ్యగారి శ్రీనివాసరావు
5. ఆవిడగారు - కొఠారి వాణీ చలపతిరావు
6. నువ్వేనేను, నేనే నువ్వు - పులిగడ్డ విశ్వనాథరావు,
7. తోడొకరుండిన అదే భాగ్యము - కలువకొలను సదానంద
కొత్త రేడియో లీల
ఈ మధ్య రేడియోల్లోనూ, టీవీల్లోనూ వస్తున్న ఫోన్ - ఇన్ కార్యక్రమాలపై చలపాక ప్రకాష్ గారి వ్యంగ్యాస్త్రం కొత్త రేడియో లీల కథాజగత్‌లో చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)