...

...

28, సెప్టెంబర్ 2011, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 50ఆధారాలు:


అడ్డం:

1. అడవి బాలకి కాదు వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలా మందే ఉన్నారు (4)

3. నిలువు 13లోని వాడే (4)

5. విశాఖ ___ ఆంధ్రుల హక్కు! ఈ నినాదం అప్పట్లో మార్మ్రోగింది (2)

6. కలరవంలో వక్రత (3)

7. అటునుంచి చివర (2)

9.  దీని సంగతి ఊరి సుద్దుల్లోనే వుంది (2)

1 1. పుష్కరాలలో గంగా నది (2)

13. జ్వాలాముఖి + మహాస్వప్న (4, 3)

15. వెనుక నుంచి సెగ పుట్టిందా? (2)

17. జాబిలితో సానుభూతి (2)

18. పారుపత్తెపు బడి (5)

19. ఇది దొరికింది గుర్రాన్ని కొన్నాడట వెనకటికి ఒకడు (2)

20. పాతాళభైరవిలోని కంపు (2)

22. విలుకాడు పెద్దలకు ఇది వదలుతాడు. కనీసం సినిమాల్లో (4, 3)

24. పరమశివుడు గరళం ఇక్కడే ఉంచుకున్నాడు (2)

25. ఇది ఎత్తుకోవడం మా హక్కు అని నిలువు 23 ఎత్తుతున్నారు యాచకులు (2)

26. దయచేయండి (2)

28. కిలాడి బుల్లెమ్మ ధరించిన నాసికాభరణము (3)

30. మీకు అస్సలు కాదు. మందు తోడిది (2)

31. ఆ ఏముంది సింగినాదం ____ (4)

32. కీరా (4)

నిలువు:
1. అగ్రభుక్కు ఆద్యంతాలతో ఱొమ్ము (2)
2. నెలవంకలో హారం కానిది (2)
3. అడ్డం 3లోని వాడే (2)
4. చొక్కా విప్పిన అంగీరస (2)
5. కడుపులో సంపదను దాచుకున్న తిష్యఫలము (4)
8. సుత్తితో జతకలిపితే సి.పి.ఎం, కంకితో జతకలిపితే సి.పి.ఐ (4)
9. ఊరుకున్న శంఖాన్ని __ చెడగొట్టినట్లు అని సామెత. (2)
10. మల్లెపూలు వెదజల్లేది సుధ గంప మధ్యన నారికేళం లో వెతకండి (3, 4)
11. కుసుమాంగుల కూటమి (4, 3)
12. తలలేని వరాలు (2)
14. ఎటునుండి ఐనా మన్మథుడే (5)
16. వగకాడా దివిటీ పట్టుకో (3)
17. లిస్టు (3)
19. తోచిన విషయాల గురించి తోచిన విధంగా చెప్పే బ్లాగు (4)
21. బంతికే రావద్దంటే ____ తెమ్మన్నట్లు (4)
22.  నగరంలో భూషణం. (2)
23. అడ్డం 25 ఎత్తుకోవడం మా హక్కు అని ఇది ఎత్తుతున్నారు యాచకులు (2)
27. జీవనాడి నావ మునిగిపోయి బోల్తా కొట్టింది (2)
28. తలపుచ్చె (2)
29. నేలను క్రిందనుండి చెక్కి (అ.క్రి.) (2)
30. __ చేసావే నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక సినిమా (2)


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి