...

...

18, డిసెంబర్ 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 34


ఆధారాలు:
 
1. హెలీకాప్టరు.
3. సంచారి బాణములలో దీపావళి సరుకును వెదుకుము.
5. ఈ సైన్సు మేకప్‌కు సంబంధించినది కాదండోయ్!
7. కఱకుదనం తొట్రు పడింది.
9. గెలుపు నగారా! 
10. కేసీయార్ ఐ లవ్యూ చెప్పింది ఇతనికే :)
11. తిమురున్న మిట్టూరోడిని పిలిస్తే నియుక్తుడు పలుకుతాడా!
14. పార్వతి. హిమవంతుడి కూతురు కదా!
15. భజసనభజసనభయ
16. 'ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా...' అంటూ భానుమతి పాడింది ఈ సినిమాలోనే.
 
నిలువు:
 
1. సర్పమును కడుపులో దాచుకున్న ఋషిపత్ని.
2. బర్బర సేన!
4. 'కాంచన మృగం' కథా రచయిత.
5. కంప్యూటర్ పరిభాషలో డిఫాల్ట్ వేల్యూ!
6. వయసుడిగిన బ్రహ్మచారికి పోలిక. కాకపోతే నాలుగో అక్షరం కాస్త ముందుకెళ్లింది. 
7. హిందుస్తానీ భాషలో ఆశ్రయము,గతి. 
8. ఆంగ్ల భాషలో వలసరాజ్యం.
9. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కిన తెలుగు వనిత.
12. ఈ నేల విస్తృతమైనదే కాని తలక్రిందలయ్యింది.
13. లంగా ఉన్న ప్రాంతం. 

7 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

అడ్డం:
1. లోహవిహంగం ;3. బాణసంచా ; 10.లగడపాటి; 16.విప్రనారాయణ; 9.విజయఢంకా; 15.లయగ్రాహి; 5.అలంకారశాస్త్రము;

నిలువు:
1.లోపాముద్ర;8. కాలనీ;13.తెలంగాణ;;9.విజయనిర్మల;6.ముదురుడబెంకాయ;

mmkodihalli చెప్పారు...

ఊకదంపుడు గారూ. తొలిబోణీ మీదే :)) పంపినవి అన్నీ సరియైన సమాధానాలే. అభినందనలు! మిగిలినవి ప్రయత్నించండి.

చదువరి చెప్పారు...

1. లోహవిహంగము
3. బాణసంచా
5. అలంకారశాస్త్రము
7. టికకా
9. విజయఢంకా
10.లగడపాటి
11.నామినీ
14.వరశైలతనయ
15.లయగ్రాహి
16.విప్రనారాయణ

నిలువు:

1. లోపాముద్ర
2. ముష్కరమూక
4. చావాశివకోటి
5. అప్రమేయవిలువ
6. ముదురుడబెంకాయ
7. టికానా
8. కాలనీ
9. విజయనిర్మల
12. మిభూలశావి
13. తెలంగాణ

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ!

అడ్డం 7,14 నిలువు 2,7 తప్ప మిగిలినవి అన్నీ సరిపోయాయి. అభినందనలు!!!

చదువరి చెప్పారు...

ఇవి పరిశీలించండి సార్

అడ్డం:
7: ఠిన్యంకా
14:

2: ముష్కరసైన్యం
7: ఠికానా

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ భేష్! ఆ మిగిలిపోయిన ఒకటీ (అడ్డం14) ఎవరైనా పూరిస్తారేమో చూద్దాము. లేకపోతే రేపు పొద్దున్నే సమాధానం చెబుతాను.

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ!
అది వరశైల కాదండి. వలిమల.