...

...

8, డిసెంబర్ 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 33


ఆధారాలు: 
అడ్డం: 
1. లీడర్‌లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది.
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది.
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్‌కూ ఉన్న సామ్యము.
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం.
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది. 
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి.
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ. 
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక.
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి!
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా?
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు.
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట!
6. కడగంటి చూపు!
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా.
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది.
9. అప్పుడప్పుడు!
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు.
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా? 

9 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

అడ్డం
7. బురుజు
8. అనామకుడు
10. కోటలో పాగా?
15. పాలపిట్ట
16.డుకుయనాథక

నిలువు
1. డా.సినరె
2. కామన్ షేర్
4. పాడుతా తీయగా
9. అడపాదడపా
12. ఆంజనేయుడు
13. అనామిక?

mmkodihalli చెప్పారు...

సౌమ్యగారూ! మీరు పంపినంత వరకు కరెక్టేనండి. కాని అడ్డం 10, నిలువు 2 కొంచెం సరిచూసుకోండి.

ఆ.సౌమ్య చెప్పారు...

అడ్డం
2. కామన్ షేరు
5. హనుమాన్ చాలీసా (హనుమాన్ వరకు కరక్టే, కానీ చాలీసా దగ్గరే డౌట్ వస్తున్నాది) :)
14. నక్షత్ర మండలము

నిలువు
5. హరినామ సంకీర్తన
7. బుడుగు
12. హనుమంతుడు


ఇంకో రెండో,మూడో మిగిలినట్లున్నాయి....ఆలోచించి తడితే మళ్ళీ కామెంటు పెడతా. :)

ఆ.సౌమ్య చెప్పారు...

అడ్డం
5. హనుమాన్ చాలీసా (హనుమాన్ వరకు కరక్టే, కానీ చాలీసా దగ్గరే డౌట్ వస్తున్నాది) :)
14. నక్షత్ర మండలము

నిలువు
2. కామన్ షేరు
5. హరినామ సంకీర్తన
7. బుడుగు
12. హనుమంతుడు


ఇందాకల కొంచం తికమక అయింది.
ఇప్పుడు సరిగ్గా పంపిస్తున్నా మళ్ళీ

జ్యోతి చెప్పారు...

అడ్డం...
3 . కొలరుపా
5. హనుమాన్ చాలీసా
7. బురుజు
9. అనామకుడు
11. గుహారము
14. నక్షత్రమండలము
15. పాలపిట్ట
16.కదానాయకుడు

నిలువు
1. డాసినారె
4. పాడుతాతీయగా
7. బుడుగు
9. అడపాదడపా
12.హనుమంతుడు
13.అనామిక

mmkodihalli చెప్పారు...

జ్యోతిగారూ! మీరు పంపినంత వరకూ అడ్డం3,11 తప్ప మిక్కినవన్నీ కరెక్టే నండి. అడ్డం 16 ఒకసారి సరిచూసుకోండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీరూ వ్యాఖ్యలను మాడరేషన్ లో పెట్టారా? బాగుంది.

జ్యోతి చెప్పారు...

అయ్యో నాది అప్పుతచ్చు. కొలనుపా

mmkodihalli చెప్పారు...

ఈ పజిల్‌ను పాక్షికంగా పూర్తి చేసిన ఆ.సౌమ్య, జ్యోతిగారలకు అభినందనలు.