...

...

9, డిసెంబర్ 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 33 సమాధానాలు!


అడ్డం: 
1. లీడర్‌లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది.  - డాబర్‌వాటికా 
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది. -  కొలనుపా (క)  
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్‌కూ ఉన్న సామ్యము. - హనుమాన్‌చాలీసా (తులసీదాసు రచించిన హనుమాన్‌చాలీసాను ఆంధ్రీకరించిన ఎం.ఎస్.రామారావుగారు సుప్రసిద్ధులు)   
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం. - బురుజు (కొండారెడ్డి బురుజు)
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :) - అనామకుడు (రామాశాస్త్రిగారి కలం పేరు.)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది. - టకోలోపాగా (కోటలోపాగా) 
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి. - గుహము (గుహము = గుఱ్ఱము)
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ. - నక్షత్రమండలము  
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక. - పాలపిట్ట
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి! - డుకుయనాథాక (కథానాయకుడు)
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో. - డా.సి.నా.రె.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా? - కామన్‌షేరు (common share)
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు. - పాడుతా తీయగా 
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట! - హరి నామ కీర్తన
6. కడగంటి చూపు! - సాచివిలోకితము 
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా. - బుడుగు 
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది. - జుటము (జూటము = ౙడముడి) 
9. అప్పుడప్పుడు! - అడపాదడపా
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. -  హనుమంతుడు 
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా? -  అనామిక (అనామిక = ఉంగరపు వేలు) 


3 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

ఆ 8, 3, 6 ఎంతసేపు ఆలోచించినా నాకు తట్టలేదు.
Thank you :)

ఊకదంపుడు చెప్పారు...

ర్ న్ స్వతంత్రాక్షరాలు కాదు కదండీ - వాటి కి ప్రత్యేకమ్ గడి కేటాయించారే

mmkodihalli చెప్పారు...

ఊకదంపుడు గారూ మీరు చెప్పింది నిజమే. అయితే అవి స్వతంత్ర అక్షరాలు కాకపోయినా ఇలాంటి పజిల్స్‌లో వాటిని అలా ప్రత్యేకంగా వ్రాస్తేనే బాగుంటుంది. అభ్యంతరం వుంటే డాబరు వాటికా,హనుమాను చాలీసా, కామను షేరు అని చదువుకుంటే సరిపోతుంది.