...

...

23, డిసెంబర్ 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 35


ఆధారాలు:
1. ఓణీ.
3. డిక్షనరీ.
5. వేదం వెంకటరాయ శాస్త్రి గారి బిరుదము.
7. లీడరు తాతకు లీలగ తనయుడైనట్టియతని బావ యలరు బోడి తడబడింది :)
9. ముళ్లపూడి వెంకటరమణ జ్ఞాపకాల ఆట! 
10. తేవర్ మగన్‌కు తెలుగు డబ్బింగ్ సినిమా. నాలుగో అక్షరం మాయం!
11. పంచాంగములలో ఒకదాన్ని వ్యాకరణంలో వెదకండి.
14. గజేంద్రమోక్షంలోని  సుప్రసిద్ధ పద్యము. పోతన విరచితము.
15. నిలువు 1తో కలిపి భరత సుతుడిని మేలుకొలుపుతున్న కవి.
16. సిఫారసు.
నిలువు:
1. చూడుము అడ్డము15.
2. మునవాహుజు :))
4.అమర గురుడు.
5. సౌదాగర్ చిత్రంతో బాలివుడ్‌లో అడుగు పెట్టిన తార. దీర్ఘాంతం.
6. తెలుగు కందమునకు యతి ప్రాస నియమములున్నవి. మరి కన్నడ కందమునకు? 
7. అబ్బాయిలు అందమైన అమ్మాయిని లేదా అమ్మాయిలు అందమైన అబ్బాయిని అచ్చికబుచ్చిక లాడి చేసుకోవలసినది.  
8. చూపు,పేరు లేదా చిహ్నము.
9.అందమైన బావను దీనితో పోల్చాడు ఒక సినీగేయకవి. అయితే అది హ్రస్వాంతమై ఐదో అక్షరం కాస్తా కొండెక్కి కూర్చుంది. 
12. వెండికొండ.
13. సల్మాను ఖాన్  ఒక మహమ్మదీయుడే.

6 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) కాంతోత్తరీయము, 3) నిఘంటువు, 5) మహామహుపాధ్యాయ, 7) మఅల, 9) కోతికొమ్మొచ్చి, 10) క్షత్రియత్రుడు, 11) కరణం, 14) లావొక్కింతయులేదు, 15) వరిగొండ, 16) రికమెండేషను.
నిలువు: 1) కాంతారావు, 2)...... 4) ...... 5) మనీషాకొయిరాలా, 6) యతినియమంలేదు, 7) మచ్చిక, 8) లక్షణం, 9) కోవాబిళ్ళబావ, 12) రజితగిరి, 13) ముసల్మాను.

చదువరి చెప్పారు...

ఆధారాలు:
1.
3. నిఘంటువు
5. మహామహోపాధ్యాయ
7. మఅల
9. కోతికొమ్మచ్చి
10. క్షత్రియత్రుడు
11. కరణం
14. లావొక్కింతయులేదు
15. వరిగొండ
16. రికమెండేషను

నిలువు:
1. కాంతారావు
2. ముత్రహోగ్నిఅ
4.
5. మనీషాకొయిరాలా
6. యతినియమంలేదు
7. మచ్చిక
8. లక్షణం
9. కోఆవుపాలవ
12. రజతగిరి
13. ముసల్మాను

ఆ.సౌమ్య చెప్పారు...

అడ్డం
3.నిఘంటువు
5. మహామహోపాధ్యాయ
7. మలఅ
9. కోతికొమ్మచ్చి
10. క్షత్రియతృడు
11. కరణం
14. లావొక్కింతయులేదు
15. వరిగొండ
16. రికమండేషన్

నిలువు
1.కాంతారావు
5. మనీషా కోయిరాలా
6.యతినియమంగళు (not sure)
7. మచ్చిక
8. అక్షణం
9.ఆవుపాలకోవ
12. రజతగిరి
13. ముస్లమాన్

mmkodihalli చెప్పారు...

భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ మీరు పంపిన వాటిలో అడ్డం 3, నిలువు 9 మినహా మిగితావి అన్నీ కరెక్టేనండి.

చదువరి గారు మీరు కూడా అడ్డం 3 తప్ప మిగిలినవి కరెక్టు వ్రాశారు.

సౌమ్యగారు మీరు అడ్డం 3, 10, నిలువు 6,8,9,13 ఒకసారి సారి చూసుకోండి.

mmkodihalli చెప్పారు...

సౌమ్యగారు మీరు అడ్డం 3, 10, నిలువు 6,8,9,13 ఒకసారి సరి చూసుకోండి

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డం 3-పదనిధి
నిలువు 4-ధిషణాధిపుడు