కొన్ని మతముల విడిగ జూతురు
అందువల్లనె ద్వేషమొదవును
భరత సుతుడా మేలుకో!
28.ఇరుల విషమును చిమ్ము జోడుతొ
వెలుగు చూడగ వెఱపు చెందెడు
రాములేడను దనుజుఁదునుమగ
భరత సుతుడా మేలుకో!
29. కలియుగమ్మున పరాశర స్మృతి
యొక్కటే ప్రామాణ్యమైనను
ఎఱుగ జాలక మనువుఁదిట్టిరి
భరత సుతుడా మేలుకో!
30.'మనువు మనువ'ని తిట్టువారలు
మనువు వ్రాసిన స్మృతిని చదువరు
గొఱ్ఱె దాటుగ తిట్టుచుందురు
భరత సుతుడా మేలుకో!
31.పరులు నీకై దైవ ప్రార్థన
చేతురట మరి సంతసమ్మే
మతము మారుట షరాయట మరి
భరత సుతుడా మేలుకో!
32.మతము మార్చిన పిదపనే మరి
మృత్యుముఖమున నున్నవానికి
గొంతులోపల నీరు పడునట
భరత సుతుడా మేలుకో!
33.మతము మారిన చదువు పదవీ
మతము మారిన కారు బంగ్లా
మతము మార్చుట వాణిజ్యము
భరత సుతుడా మేలుకో!
34.'మాకు ఒక్కడె దేవు'డనుచును
'మీరు మూర్ఖులు కనుక పెక్క'ను
వెక్కిరింపుకు వెతల నొందక
భరత సుతుడా మేలుకో!
35.దేవుడొక్కొడె పేర్లు వేలని
విజ్ఞులెందరొ చెప్పియున్నను
తెలివిలేమితొ వెక్కిరింతురు
భరత సుతుడా మేలుకో!
36.తాము నమ్మిన మతపు సారము
నెఱుగకుండిన కూళలందరు
పరుల మతమును వెక్కిరింతురు
భరత సుతుడా మేలుకో!
- వరిగొండ కాంతారావు
2 కామెంట్‌లు:
వరిగొండ కాంతారావు గారి కవితలు నిజాల నిగ్గుతీసి నగ్నంగా నిలబెడుతున్నాయి.
అవునండి చాలా సరళ పదములతో, గట్టిగా నిద్రలేపుతున్నారు కాంతారావు గారు. సమీక్షించే ఉద్దేశ్యాన్ని విరమించి మొత్తం ప్రచురించే శ్రమ తీసుకున్నందుకు మీకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి