...

...

14, జులై 2010, బుధవారం

కవితాభిషేకం! - 10పదునౌ ఖడ్గముఁ బూని రక్తఝరులన్ పారించి, సామ్రాజ్య సం
పదలన్ గైకొని సార్వభౌమ పదవిన్ భాసించినావటులే
మృదువౌ గంటముఁబూని ముగ్ధకవితాహేవాకమాధ్వీక సం
పదలన్ నింపి కవీంద్ర పీఠిగొనినావా! కృష్ణధాత్రీశ్వరా!

కమ్మని తేనెలన్ జిలుకు
        కైతలు, వీనుల విందుఁగూర్చు గా
నమ్ములు, నేత్రపర్వమగు
        నవ్యమనోహర ముగ్ధ శిల్పజా
లమ్ములు, భామినీ మధుర
        లాస్య విలాస విభాసమాన నా
ట్యమ్ములు నిండిపోయినవి
        రా! యొకనాఁడు తెలుంగు గడ్డపై.

’భువన విజయము’ సుధోపమ
కవన నిలయమై, కవీంద్ర కల్పాశ్రయమై
వివిధ కవిత్వసుగంధ
స్రవంతికలు నింపెఁదెల్గు రాజ్యమునంతన్

                                     - యస్.రాజన్న కవి 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి