...

...

6, జులై 2010, మంగళవారం

కవితాభిషేకం! -2


మ. ధరకెంధూళులు కృష్ణరాయల చమూ ధాటీగతిన్ వింధ్యగ
    హ్వరముల్ దూఱఁగజూచి, తా రచటఁ గాఁపై యుండుటన్ జాల న
    చ్చెరువై యెఱ్ఱని వింత చీకఁటులు వచ్చెం జుడరే!యంచు వే
    సొరిదిం జూతురు వీరరుద్రగజరాట్ శుద్ధాంతముగ్ధాంగనల్

చ. అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకములన్ లిఖియించి తాళస
    సన్నిభముగఁ బొట్టునూరికడ నిల్పిన కంబము, సింహ భూధర
    ప్రభు తిరునాళ్ళకున్ దిగు సురప్రకరంబు కళింగ మేదినీ
    విభు నపకీర్తి కజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలున్.


మహా స్రగ్ధర.  ఎకరాలఁ మండువా సాహిణములఁగల భద్రేభ సందోహ వాహ
                   ప్రకరంబుల్ గొంచుఁ దత్త త్ప్రభువులు పనుపన్ రాయబారుల్ విలోకో
                  త్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని యవసరముల్ చూతురందంద కొల్వం
                  దక యా ప్రత్యూష మా సంధ్యము పనివడి తన్మందిరాళింద భూమిన్

చ. మదకల కుంభి కుంభ నవ మౌక్తికముల్ గనుపట్టు దట్టమై
    వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
    భ్యుదయమునొంది శత్రవుల పుట్టి మునుంగఁగ ఫేనపంక్తితోఁ
    బొదిగొని పైపయిన్ వెడలు బుద్బుదపంక్తులు వోలెఁ బోరులన్

సీ. వేదండ భయద శుండాదండ నిర్వాంత
                    వమధువుల్ పైఁజిల్కు వారిగాఁగఁ
    దత్కర్ణవిస్తీర్ణ తాళవృంతోద్ధూత
                    ధూళి చేటలఁ జల్లు దుమ్ము గాఁగ
    శ్రమబుర్బురుత్తురంగను నాసికాగళ
                    త్పంకంబు వైచు కర్దమము గాఁగఁ
    గుపిత యోధాక్షిప్త కుంతకాంతారభే 
                    లనములు దండఘట్టనలు గాఁగఁ

తే.  జెనఁటి పగఱ ప్రతాపంబి చిచ్చులార్చు
     కరణి, గడిదేశములు చొచ్చి కలఁచి యలఁచు
     మూరురాయర గండాంక వీర కృష్ణ
     రాయ భూభృద్భయంకర ప్రబలధాటి.
                                                           - అల్లసాని పెద్దన

కామెంట్‌లు లేవు: