...

...

10, జులై 2010, శనివారం

కవితాభిషేకం ! - 6


కం. నరసింహ కృష్ణరాయా
     దురమున నీ పేరిటేఱు తురకలఁ జంపెన్
     గరి రాజ వరదుఁ డంచును 
     గరి ఘట లట మిమ్ముజూచి గ్రక్కునవచ్చెన్.

శా. శ్రీలీలాత్మజ కృష్ణరాయ! సమరోర్విన్ నీదు వైరిక్షమా
    పాలు ర్వీఁగి హయాధిరూడులగుచుం బాఱన్ వనీశాఖిశా
    ఖాలగ్నాయత కేశపాశులయి యూఁగన్ గే కిసల్గొట్టి యు
    య్యాలో జొంపలొ యంచుఁ బాడుదురు భిల్లాంభోజ పత్రేక్షణల్!


మ.బలభిన్నాగము చెంపఁగొట్టి గిరిజా ప్రాణేశు నఱ్ఱెక్కి వా
   జలజాతేక్షణ కొప్పుపట్టి శశి వక్షంబెక్కి ధట్టించి యా
   బలరామున్ మొలఁబట్టి నీ యశము భూభాగమ్మునన్ మించెనౌ
   లలనా మన్మథ! కృష్ణరాయ నరపాలా రాజకంఠీరవా 

గీ. పద్మనాట్యస్థలంబునఁ బక్కిలోనఁ
    బైరుపైఁ బవ్వళించిన పరమమూర్తి
    అనుదినంబును గృష్ణరాయాధిపునకుఁ
    జుక్కజగడాల వేలుపు శుభములొసఁగు

చ. పెనిమిటి చేయు పుణ్యజన పీడనవృత్తియుఁ దండ్రి భంగమున్
    దనయుననంగ భావమును దమ్ముని కార్శ్యమును జూచి రోసి స
    జ్జన పరిరక్షు శౌర్యనిధిఁ జారు శరీరుఁ గళాప్రపూర్ణు న
    వ్వన నిధి కన్య చేరె జితవైరినికాయునిఁ గృష్ణరాయనిన్

ఉ. అబ్జముఖీమనోజ! నరసాధిపనందన! కృష్ణ! నీ యశం
   బబ్జ కరాబ్జ జాజ్జనయనాబ్జ విలాసము నీ వితీర్ణిమం
   బబ్జ కరాబ్జ జాజ్జనయనాబ్జ విలాసము నీ పరాక్రమం
   బబ్జ కరాబ్జ జాజ్జనయనాబ్జ విలాసము చిత్రమిద్ధరన్ 


                                                               - చాటువులు 


                                                                                                            
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి