...

...

12, జులై 2010, సోమవారం

పోటీ ముగిసింది!

వర్తమాన కథాకదంబం కథాజగత్ వంద కథలను ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు నిర్వహించిన కథావిశ్లేషణ పోటీ ఇంతటితో ముగిసింది. ఈ పోటీకి విశేషమైన స్పందన అనలేం కానీ వచ్చిన స్పందన మాత్రం సంతృప్తికరంగానే వుంది. ఈ పోటీ మూలంగా కథాజగత్ సందర్శకులు ఈ నెల రోజుల్లో మూడురెట్లు పెరిగారు(అంతకు ముందు నెల రోజులతో పోలిస్తే)! పాల్గొన్న వారు మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 16 కథలపై 17 విశ్లేషణలు 11మంది బ్లాగర్ల నుండి పోటీకి వచ్చాయి. పాల్గొన్న అందరికీ తురుపుముక్క అభినందనలను తెలియజేస్తోంది. శుభాకాంక్షలను అందిస్తున్నది. ఫలితాలు అతి త్వరలో తెలియజేస్తాం. ఈ పోటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పోటీకి ప్రాచుర్యం కల్పించిన మాలిక, కూడలి సంకలినుల నిర్వాహకులకు మా కృతజ్ఞతలు! మునుముందు మీ అందరి ప్రోత్సాహం తురుపుముక్క, కథాజగత్‌లపై యిలాగే వుండగలదని ఆశిస్తున్నాం.     
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి