...
24, జులై 2010, శనివారం
కవితాభిషేకం! - 19
శా. వీర శ్రీ నరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
ధౌరంధర్యమునన్ జగంబు ముదమంద 'న్నాగమాంబా' సుతుం
డారూఢోన్నతి 'కృష్ణరాయడు' విభుండై రత్న సింహాసనం
బారో హించె, విరోధులు న్గహన శైలా రోహముంజేయగన్ .
సీ. ఉదయాద్రి వేగయత్యుద్ధతి సాధించె
వినుకొండ మాటమాత్రనహరించెఁ
గూటము ల్సెదరంగఁ కొండవీడ గలించె
బెల్లముకొండ యచ్చెల్ల జెఱిచె
దేవరకొండ యద్వృత్తి భంగముసేసె
జల్లిపల్లె సమగ్రశక్తిఁ దులిచె
గినుకమీఱ ననంతగిరి క్రిందుపడఁజేసె
గంబంబు మెట్టు గ్రక్కునఁ గదల్చె
తే. బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ
గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయ విభుఁడు
సీ. చక్రవర్తి మహాప్రశస్తి నాడును నేడు
చెలగి ధర్మ క్రమ స్థితి ఘటించె
భూభృద్ధరణ విస్ఫూర్తి నాడును నేడు
గోరక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
సాధు బృందావన సరణి నాడును నేడు
వంశానురాగంబు వదలడయ్యె
సత్యభామా భోగసక్తి నాడును నేడు
నా కల్ప మవని నింపార నిలిపె
తే. నాడు నేడును యాదవాన్వయము నందు
జననమందెను వసుదేవ మనుజ విభుని
కృష్ణుడను పేర సరసేంద్రు కృష్ణదేవ
రాయడను పేర నాది నారాయణుండు
కం. ప్రతివర్ష వసంతోత్సవ
కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూప్రసాదన రసికా!
కం. తిరుమల దేవీ వల్లభ
కరుణామయ హృదయ! రాజకంఠీరవ! యీ
శ్వర నరస భూపురంధర
వరనందన; బాసదప్పవర గండాంకా!
-నంది తిమ్మన
Labels:
royal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి