...

...

17, జులై 2010, శనివారం

కవితాభిషేకం! - 13


కం. ధీశార్చ్య! ఇడాపాలా!
     ఆశాంతాఖ్యా! ప్రవీర! అక్షరశిక్షా! 
     నీ శారద రూపంబు క
     వీశ వితతి కృష్ణరాయ యెంతే పొగడున్ 
                                   (నిషిద్ధాక్షరి) 

శా. చేలాకర్షణ భావజోదయ గతుల్ చిత్తంబునన్ నింపగన్
    లీలామానుష విగ్రహుండగుచు పల్‍క్లేశంబులన్ డుల్చగన్
    శ్రీలాలిత్య యశోధురీణుడయి సంక్రీడించుచు న్నాజి లీ
    లం,గాలుం,గీలును వింగడించు పనికేకా కృష్ణరాయల్ దగున్

(సమస్యా పూరణం: లంగా లుంగీలను వింగడించు పనికేకా కృష్ణదేవరాయల్ దగున్)

ఆ.వె. కృష్ణరాయడెంత కృతకృత్యుడో గాని
      ప్రజల మానసముల బ్రతికియుండె
      సంస్కృతిప్రసూన సౌరభ్య మేపారు
      నంత కాల మత డనంత యశుడె.
                               (ఆశువు)

                          -ఆశావాది ప్రకాశరావు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి