...

...

2, జులై 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 14ఆధారాలు: 

అడ్డం: 
1. సారథి తడబడ్డాడు. (ఆదిలోనే హంసపాదు!)
3. సాముగరడీలు, మల్లయుద్ధాలు నేర్పే దేశవాళీ జిమ్!
5. మహావీరమయూర సినిమా కథానాయకుడు ఇలా సుప్రసిద్ధుడు.
7. మాత్ర!
9. సామర్ల వెంకట రంగారావు మాయల మరాఠీగా నటించిన 1959 నాటి సినిమా!
10. తుగ్లక్ స్వామి!
11.  మహేష్‌బాబు, సోనాలి బింద్రేల ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
14.  బాలయ్య కోడిరామకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 1990 సినిమా. విజయశాంతి హీరోయిన్.
15.ప్రథమా విభక్తి.
16.గురజాడవి ఈ మౌక్తికపు దండలు!
నిలువు:
1. ఇది పెట్టడమంటే మోసం చేయడమే!
2.  జంబుఖానా! తివాసి!!
4. కొత్తపాళీని చేబూనిన బ్లాగ్లోకపు భీష్మాచార్యులు!
5.  కటపట నాకము అంతా మోసం!
6.  ఈ చంద్రుడు 'వల','లక్ష','క్షమ'లను తనలో లీనం చేసుకున్నాడు.  
7. ముద్దుగుమ్మ దర్వాజా!
8. నార్త్ ఇండియన్ తినుబండారము. జ్యోతిగారి షడ్రుచులలో లభ్యం కావచ్చు!
9.  వేదవ్యాసుడే!
12. స్వాప్నిక రాష్ట్రపతి స్వంత ఊరి పేరులోని మధ్య అక్షరం  ముందుకురికింది.
13. టాటా! గుడ్‌బై! ఇంక సెలవు!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి