...

...

11, జులై 2010, ఆదివారం

కవితాభిషేకం! - 7


ఉ. కాయము వంగి తాముదిసెఁ గన్నులన్ బొరగప్పెఁగాలు పే
   దాయె నటంచు రోసి నరసాధిప నందన! కృష్ణరాయ! యీ
   భూయువతీలలామ నిను బొందిన నాది భుజంగ భర్తకున్
   బాయని చింతచేతఁ తలప్రాణము తోకకు రాకయుండునే


మ. అలలం బాఱితి వేమి? కృష్ణ! పతిదేవా! కృష్ణరాయ క్షమా
    తల నాథుండని వారితాన్నమిడఁగాఁ దద్బ్రాహ్మణా పోశనం
    బులకుం బోయె సముద్ర జీవన మిఁకం బూరించు నారాజు ని
    ర్మలితాన్నోదక దానధారల విచారంబేల ప్రాణీశ్వరీ! 



సీ. చెడిపి రాలొత్తిన యడుగుఁ దమ్ములకును
              గట్టుపయ్యెదఁ జించి చుట్టుకొనుచు
    బయలైన కుచకుంభ పాళులకును జంటి
              శిశువుల మాటుగాఁ జేర్చుకొనుచుఁ
    గనుగందులకు వడగాలికిఁ జాటుగాఁ
              గచభరంబు విప్పి కప్పుకొనుచు
    వీడిన తురుము నీవియదాక సడలించి
              చేలాంతము ముసుగు చేర్చుకొనుచు

గీ. ఖాన మల్క వజీరుల మానవతుల
    పాటు పరుపున నీవు కల్బరిగ గొనిన
    బ్రమసి దెసచెడి నలుగడఁ బఱతురౌర
    యహాహో పేంద్ర! కృష్ణరాయ క్షితీంద్ర!
                                        
                                                               - చాటువులు                                 


కామెంట్‌లు లేవు: