...
7, జులై 2010, బుధవారం
కవితాభిషేకం! - 3
మ. శరసంధాన బలక్షమాది వివిధై శ్వర్యంబులుంగల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ కలన్ బ్రహ్మఘ్నతల్ మానినన్
నరసింహ క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహ క్షితి మండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!
(నరసింహదేవరాయల కుమారుడైన కృష్ణదేవరాయా! రాజశ్రేష్ఠా! నరుడు(అర్జునుడు) శరసంధానములోను, సింహము బలములోను, భూమి ఓర్పులోను, ఈశ్వరుడు ఐశ్వర్యములోను గొప్పవారే అయిననూ నీతో పోల్చ దగరు. ఎందుకనిన పై నల్గురిలో నాలుగు దోషములు నపుంసకత్వము - గుహలో దాగియుండుట - భూకంపము - బ్రహ్మ హత్య అనునవి వరుసగా కలవు అని భావము.)
సీ. ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి
కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె
మనుచరిత్రంబందుకొను వేళఁ బురమేగఁ
బల్లకిఁ దనకేలఁ బట్టి యెత్తె
గోకటాగ్రామాద్యనేకా గ్రహారంబు
లడిగిన సీమలయందౌ నిచ్చె
బిరుదైన కవి గండపెండేరమున కీవ
తగుదని తానె పాదమునఁ దొడగె
గీ. ఆంధ్రకవితాపితామహ! అల్లసాని
పెద్దన కవీంద్ర! యని తన్నుఁబిల్చునట్టి
కృష్ణరాయలతో దివికేఁగ లేక
బ్రతికి యున్నాఁడ జీవచ్చవంబ నగుచు.
- అల్లసాని పెద్దన
Labels:
royal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి