సీ. శ్రీల బెంపొంద దక్షిణ హిందు సామ్రాజ్య
మేలె నెవ్వాడు మహిష్ట శక్తి,
దేశభాషలయందు దెనుగు లెస్సనెడు నా
నుడి బేర్మి నెవ్వడను గ్రహించె,
అష్టదిగ్గజములన్ యశన్య్ గాంచిన పెద్ద
నాదుల నెవడెంతొ యాదరించె,
ఆముక్త మాల్యదాఖ్య గంథ రచన బ్ర
బంధ మార్గము గానబఱచె నెవడు.
గీ. మూరురాయర గండాంక వీరుడాంధ్ర
భోజ నరపతి సత్కవి రాజనంగ
బిరుదములు బొందె నెవడట్టి సరస హృదయు
డలరె’శ్రీకృష్ణ దేవరాయాధి’ పుండు.
- రావూరు దొరస్వామిశర్మ
2 కామెంట్‌లు:
రాజులకే రాజు , రారాజు రాయలట......,
బ్లాగుల లోకెల్ల మీ బ్లాగు బాగు,బాగు, బహుబాగట.........,
నేటినుండి నేను మీ బ్లాగాభిమానినట......
అభినందనలు!
కవితాభిషేకంలో రాయలవారిని కీర్తించే మంచి పద్యాల్ని సేకరించి ప్రచురించినందుకు ధన్యవాదాలు.
ముఖ్యంగా తెనాలి రామకృష్ణుల వారి పద్యం చాలా బావుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి