...

...

19, జులై 2010, సోమవారం

కవితాభిషేకం! - 15ఆముక్తమాల్యదా సీమంత శిఖమీది
        చేమంతి దండతో చెలిమి చేసి;
మాలదాసరి జగన్మంగళ కైశికీ
        గాన ప్రవాహాన స్నానమాడి;
విష్ణుచిత్తుని యింట వైష్ణవోత్తములకు 
        శాకపాకంబుల చవులు చెప్పి;
పాలరా సోపాన పంక్తి రాయంచ ఱె
        క్కల కొన పసుపు బంగారు దిద్ది;

దేవళము గూండ్లలో కూర్కు పావురాల
మేలి చిఱుగంట రవళి మేలుకొల్పి
రాయ దేవేంద్ర! నీ కళా రాజ్యలక్ష్మి
తెలుగు సాహితి కలదాఁక వెలుఁగుగాక!!

               - కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి