...

...

17, జులై 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 17ఆధారాలు: 

అడ్డం: 
1. శనిమహాత్ముడు ముళ్ళపూడి వెంకటరమణ స్టైల్లో! :)) 
3. చేదుగల సొరకాయ బహుజనపల్లివారి శబ్దరత్నాకరం సాక్షిగా!
5. డాక్టర్ చక్రవర్తి సినిమాలో శ్రీశ్రీ పాట అత్రేయది కాదు సుమా!
7. మా ఊరు మదరాసు నా పేరు రాందాసు అని పద్మనాభం పాట తన సొంత సినిమాలో!
9.బ్రహ్మంగారి మనుమరాలు. ఈవిడకీ ఓ మఠం ఉంది కడపజిల్లాలో. 
10. రామానుజాచార్యుల గురువు!
11.  ప్రియా! 
14.  స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఈ దేశబంధువు! 
15. ఝల్లరి
16. చార్మినార్‌, సాలార్‌జంగ్‌, ఒ.యు, మక్కామసీదు, మసాబ్‌ ట్యాంక్‌, హుస్సేన్‌సాగర్‌ అన్నీ నిర్మించినది ఎవరబ్బా?
నిలువు:
1. శత్రువు నడుమ దస్తూరి చేరిస్తే తిరుమల కొండ పాదం!
2.  క్రిందినుంచి '_____ ఫల్గుణుడు అవశ్యము గెల్తు మనంగ రాదు'  సుప్రసిద్ధ భారత పద్యం తిక్కనగారిది.
4.  'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకుడు. 
5.  ఎపిడెమిక్ స్మాల్‌ఫాక్స్.
6.  దీని గురించి కాకికి ఏమి తెలుసునని శ్రీశ్రీగారి డౌటు!!  
7.  అంతఃపురంలో దేవి.డి ఉన్నదా?
8.  భోజనం ___ హోటళ్ల ముందు కనిపించే బోర్డు. 
9.   రెండుసార్లు ఈశ్వరుణ్ణి పిలిస్తే విష్ణువు పలుకుతాడేమిటి చెప్మా! 
12. ఈ జగన్మోహిని ఇక్కడ తడబడింది కానీ అప్పట్లో యువకుల మనస్సును కొల్లగొట్టేది. కావాలంటే నిలువు 4.ను అడగండి. 
13. పుణ్యమూర్తుల అప్పలరాజు మనిషి రోడ్డున పడ్డాడు సినిమా హీరోయే!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి