...
18, జులై 2010, ఆదివారం
కవితాభిషేకం! - 14
థారాజద్గతిఁ బుష్పవద్భగణ శస్తంబైన కాలంబునన్
సారంబై వెలుఁగొందఁజేసెను, దదాస్థానమ్మునం బండితాం
భోరుట్సంభవు లష్టదిగ్గజములన్ స్ఫూర్తిన్ గవుల్వొల్చి రా
వీరాగ్రేసర చక్రవర్తి మృగరాట్పీఠోపవిష్టుండు నా
నా రాజస్య కిరీటసంఘటిత రత్నవ్రాత నీరాజితో
దారాంఘ్రిద్యయుఁడొక్కనాడు సభలోఁ దాంబూలమున్ గండపెం
డారమ్ముంగొని సంస్కృతాంధ్రకవితాటంకారధారా చమ
త్కారంబేర్పడ నాశువైఖరి సముద్యత్పదముల్ సెప్పి స
త్కారమ్మున్ గ్రహింపుఁడీయనఁ గవీంద్రశ్రేణి తూష్ణీకమై
నీరావాబ్ధి ప్రతీకమై నిలువఁదానే పెద్దనామాత్యుఁ డే
పారన్ లేచి గభీరధీర మధురవ్యాహార కర్పూర వి
స్మేరుం డుత్పలమాలికా ప్రకటితోన్మేషుండుగా, నెల్లరున్
సారంగాయత లోచనా కుచతటోచ్చైశ్శోభిముక్తావళీ
హారస్నిగ్ధులు చంద్రబింబ వదనా సాకూత మందస్మితాం
కూరజ్యోత్స్నలఁ దోఁగువారు దివిషత్కూలంకషా సైకత
స్ఫార శ్రోణివిలాస లాలసవధూ సన్మేఖలా కింకిణీ
వారోత్సూత్రమనోశ్వు లెట్టు లటులై వర్తిల్లువారై రసాం
భోరాశిప్లవమాన మానసులుగా, భూపాలుఁ డవ్వేళ స
త్కారార్హుండని పెద్దనార్యు పదపద్మంబూని తా గండ పెం
డారమ్మున్ గయిసేసి బ్రహ్మరథమున్ బట్టెన్ యశశ్చంద్రికా
స్వారాజ్యమ్మునకున్ బ్రమోదమెసఁగన్ బట్టమ్ముగట్టెన్ ధరి
త్రీ రాజ్యమ్ములువోయె, రాజకులము దిక్కేది వోయెన్ క్షణా
కారంబూచు శరచ్ఛతమ్ములరిగెన్ గల్పస్థిరంబౌచుఁ ద
చ్చారుస్వచ్ఛయశః ప్రశస్తి నిలిచెన్ సర్వంసహామండలిన్
(సి.వి.సుబ్బన్న శతావధాని గారి శార్దూల మాలిక కొంతభాగం)
Labels:
royal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి