కం. ధీశార్చ్య! ఇడాపాలా!
ఆశాంతాఖ్యా! ప్రవీర! అక్షరశిక్షా!
నీ శారద రూపంబు క
వీశ వితతి కృష్ణరాయ యెంతే పొగడున్
(నిషిద్ధాక్షరి)
శా. చేలాకర్షణ భావజోదయ గతుల్ చిత్తంబునన్ నింపగన్
లీలామానుష విగ్రహుండగుచు పల్క్లేశంబులన్ డుల్చగన్
శ్రీలాలిత్య యశోధురీణుడయి సంక్రీడించుచు న్నాజి లీ
లం,గాలుం,గీలును వింగడించు పనికేకా కృష్ణరాయల్ దగున్
(సమస్యా పూరణం: లంగా లుంగీలను వింగడించు పనికేకా కృష్ణదేవరాయల్ దగున్)
ఆ.వె. కృష్ణరాయడెంత కృతకృత్యుడో గాని
ప్రజల మానసముల బ్రతికియుండె
సంస్కృతిప్రసూన సౌరభ్య మేపారు
నంత కాల మత డనంత యశుడె.
(ఆశువు)
-ఆశావాది ప్రకాశరావు.
2 కామెంట్లు:
ఆహా! కృష్ణ దేవరాయాల వేషం లో కన్నడ రాజకుమార్ బొమ్మ చూసి ఎన్నాళ్ళయింది. పద్యాలు అదుర్స్.
చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.
సమస్యపాదంలో ‘టైపాట్లు’ ఉన్నాయి. గణయతి దోషాలు రెండూ ఉన్నాయి.
‘లంగాలుంగిల వింగడించు పనికేలా కృష్ణరాయల్ దగున్’ కావచ్చు. ఒకసారి చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి