...

...

9, జులై 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 15


ఈ పజిల్‌ను భమిడిపాటి సూర్యలక్ష్మి, వేదుల సుభద్రగారు కొంతభాగం పూరించారు. ఈసారి పజిల్ చాలా కష్టంగా ఉంది అన్న అభిప్రాయం వెలువడింది. అందుకే ఆధారాలలో మరి కొన్ని హింట్లు ఇస్తున్నాను. పజిల్‌ను సాధించండి.  
ఆధారాలు: 

అడ్డం: 
1. పద్మము వంటి ముఖామా?
3. మెండుగా 'మునిని రమ్మనుము'.   
5. నిలువు 5.వంటిదే. పదములతోడిది.
7. తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం!
9. దుష్కరత్వమును పోలిన మూర్ఖత్వము
10. కొంచెం పొడిగించిన ఎదురు బదురు!
11.  అటునుంచి సినీ సత్యభామ!
14.  మునిద్వయంతో నూత్నయవ్వనానికి బండగుర్తు! శ్రీనాథుని మరుత్తరాట్‌చరిత్రను గుర్తు చేసుకోండి.
15. ముసలమ్మ మరణములోని అయోగ్రము.
16.విశాఖ దత్తుని అచ్చుతప్పుల నాటిక!
నిలువు:
1. రామారెడ్డిగారిది ఒకటే అద్దము.
2.  ముఖ్యమైన దళము!  తలబద్దలు కొట్టుకోవడమెందుకు? ఆధారంలోనే సమాధానం ఉంది:))
4. వేణూనాదము! మురళీ వరకూ కరెక్టే!
5.  అడ్డము 5 వంటిదే.  అక్షరముల విన్యాసము. హింట్ కావాలా? ఇక్కడ నొక్కండి.
6.  నాలుగింట మూడువంతులు పదహారింట మూడువంతులు! (పాతికకు రాయలసీమ మాండలికం... ) 
7. సూరిగాడు సినిమాలో సురేష్ సరసన నటించి'నది'!
8. శీర్షాసనం వేసిన కాలుడు! 
9.  ముద్రాంగుళీయకము!
12. తడబడిన ప్రదోషము.
13. శిఖరము. 

2 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

3 అడ్డం - ముమ్మరము
14 అడ్డం - మునిముని మీసము
4 నిలువు - మురళీ రవము

mmkodihalli చెప్పారు...

శంకరయ్యగారూ అభినందనలు!