అడ్డము:
1. పద్మము వంటి ముఖామా? - ముఖారవిందము
3. 'మెండు'గా మునిని రమ్మనుము. - ముమ్మరము
5. నిలువు 5.వంటిదే. పదములతోడిది. - ముక్తపదగ్రస్తము
7. తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం! - యముడు
9. దుష్కరత్వమును పోలిన మూర్ఖత్వము - ముష్కరత్వము
10. కొంచెం పొడిగించిన ఎదురు బదురు! - ముఖాముఖము
11. అటునుంచి సినీ సత్యభామ! - నముజ (జమున సత్యభామ పాత్రలో రాణించిన సినీ నటి)
14. మునిద్వయంతో నూత్నయవ్వనానికి బండగుర్తు! - మునిముని మీసము (నూనూగు మీసమునకు పర్యాయపదం)
15. ముసలమ్మ మరణములోని అయోగ్రము. - ముసలము (అయోగ్రము అంటే రోకలి)
16.విశాఖ దత్తుని అచ్చుతప్పుల నాటిక! - ముద్రారాక్షసము (అచ్చు తప్పులను ముద్రారాక్షసాలు అంటారు)
నిలువు:
1. రామారెడ్డిగారిది ఒకటే అద్దము. - ముకురము (ముకురాల రామారెడ్డి పేరొందిన సాహితీవేత్త)
2. ముఖ్యమైన దళము! - ముఖ్యదళము
4. వేణూనాదము! - మురళీరవము
5. అడ్డము 5 వంటిదే. అక్షరముల విన్యాసము. - ముక్తాక్షరగ్రస్తము
5. అడ్డము 5 వంటిదే. అక్షరముల విన్యాసము. - ముక్తాక్షరగ్రస్తము
6. నాలుగింట మూడువంతులు పదహారింట మూడువంతులు! - ముక్కాలు మువ్వీసము
7. సూరిగాడు సినిమాలో సురేష్ సరసన నటించి'నది'! - యమున
8. శీర్షాసనం వేసిన కాలుడు! - డుముజ (జముడు, యముడు, కాలుడు)
9. ముద్రాంగుళీయకము! - ముద్దుటుంగరము
12. తడబడిన ప్రదోషము. - ముశానిఖము (నిశాముఖము అంటే పెందలకడ, మునిమాపు, ప్రదోషము)
13. శిఖరము. - ముకుటము
3 కామెంట్లు:
చాలా బాగుందండి గడి. ఆద్యంతం ముదము నిచ్చింది:-) నాకు ముక్తాక్షరగ్రస్తము, నిశాముఖము రాలేదు.
కామేశ్వరరావుగారూ ధన్యవాదాలు!
అయ్యొ! క్లూ యిచ్చినా రాయలేకపోయాను.నా బుర్రకి ఇంకా చాలా పదును పెట్టవలసిన అవసరంవుంది. మీరు ఇలాగే కొనసాగించండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి