...

...

14, జులై 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 16


ఆధారాలు: 

అడ్డం: 
1. కథాజగత్‌లో దిలావర్‌గారి కథ!
3. అమ్మ తమ్ముడా!   
5. తెలుగు బ్లాగుల బుల్‌డోజరు!
7. వెలుతురుకి వ్యతిరేకం!
9. ఉపపురాణాలలో రెండవది చివరి రెండక్షరాలు మాయం!
10.& నిలువు 13. గాన సభ అధ్యక్షులట ఈ దీక్షితులు! తెలియకపోతే గూగులమ్మని అడగండి.
11.  మనోహరమైన కతకము
14.  నిమ్నజనుల తిరగబడ్డ 'చరిత్ర' 
15. కాసు బ్రహ్మానందరెడ్డి గారికి తిరపతితో లిటిగేషన్ ఏంటి?
16. అవధానులు వందమంది పృచ్ఛకులతో చేసే ఫీట్లు!
నిలువు:
1. దీపావళి టపాసులలో ఒకటి. 
2.  కుంభకోణాలు ఆఖరికి దీనినీ వదలలేదు! కార్గిల్ దీనికి కార్యస్థానం.
4. సుజాతగారి బ్లాగు!
5.  ఈ మధ్యే భర్తగ మారిన బ్యాచిలరు ఈ క్రికెట్టు వీరుడు.
6.  ఆద్యంతాలు లేని మైదానం రచైత.
7.   దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా పాటకు అనువైన సాధనము!
8.  కటిసూత్రములో త్రికము.
9.  ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా అంటూ ఎం.ఎల్.వసంతకుమారి ఆలపించిన విరహగీతం ఈ సినిమాలోనిదే!
12. ఒకానొక ఆయుర్వేద లేహ్యం!  
13. చూడండి అడ్డం 10.

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అడ్డం
1. చిన్నిచిన్ని ఆశ 3. మేనమామ 5. మలక్ పేట రౌడి 7.చీకటి 9.నారసిం హపు10. కళా వెంకట 11.రుచ్యము 14.నిమ్నజనతరిచ 15. తిరకాసు 16. శతావధానాలు
నిలువు
1.చిచ్చుబుడ్డి 2.శవపేటిక 4.మనసులోమాట 5.మహేంద్రసింగ్ ధోని 6. డిపాటివెంకటచ 7.చీపురు 8.టికము 9. నాగులచవితి 12.చ్యవనప్రాశ 13.దీక్షితులు
సుభద్ర వేదుల/ప్రసీద
అడ్డం 14 గురించొక అనుమానం సార్: నాకు ఇది తెలియలేదు. చరిత్ర తిరగబడింది అన్నారు కదా అని అలా రసాను. సరి అయిన జవాబు చెప్పండి. మిగతావి అన్నీ సరి అయ్యాయని అనుకుంటాను. ధన్యవాదాలు.

mmkodihalli చెప్పారు...

తొమ్మిది నిలువు, తొమ్మిది అడ్డం తప్ప అన్నీ కరెక్టు సమాధాలు ఇచ్చారు సుభద్రగారూ. అభినందనలు!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 9. నరసింహ
నిలువు: 9.నలదమయంతి

Unknown చెప్పారు...

వచ్చేసాయి. 9 అడ్డం నరసిం హ పురాణ
9. నిలువు : నల దమయంతి
నరసిం హ పురాణం అనుకుని బల్వంతంగా నాగులచవితి కోసం అలా మార్చాను. :)