ఆధారాలు:
అడ్డం:
1. ఇటీవల వెలువడిన గోరటి వెంకన్న పాటల పుస్తకం!
3. భారతీయ క్రికెట్‌లో మేటి మన హైదరాబాద్ క్రీడాకారుడు. ముందు తరం వాడు.
5. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమాధి ఉన్నది?
7. పాలవాడు కలిపే నీళ్లలో ఆనవాయితి!
9.మగవాడైన తొలి మానవుడు ఆడం _____ నుంచి హవ్వ(తొలి మహిళ) జన్మించినట్లు పుక్కిటి పురాణం!
10. ఇతడైనా తినాల్సింది లవణమన్నమే! ఐతే 3,4 అక్షరాలు తారుమారు.
11. గుబులులో గుబులు!
14. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఉండేవి కదా? టఫ్ సిచ్యువేషన్స్!
15. జొన్నలగడ్డ దంపతుల కలం పేరు?
16. నాయుడోళ్ళింటి కాడ __ __ __ కింద నాయుడేమన్నాడే పిల్లా.
నిలువు:
1. పెద్దన యింటిపేరు కాసాని కాదు. మేడసాని అసలే కాదు :-)
2. లచ్చికోడలి మగడు!
4. నక్సలైట్లచే బలికాబడిన మాజీ మంత్రి!
5. ఆంగ్ల సచిత్రవార పత్రిక.
6. loco కోపము కారము కలగలసిన జగత్ కళ్యాణములు!
7. దివాకర్‌బాబును ఆరా తీయండి.
8. ఎ.పి.జె.అబ్దుల్ కలాం కనమన్నది బిడ్డల్ని కాదు.
9. ఏయ్ బావయ్యా పిలక బావయ్యా అంటూ సినారె ఆటపట్టించింది ఇతడినే!
12. తెలిసిన
13. గారడి వాడు ప్రదర్శించేది?
3 కామెంట్‌లు:
అడ్డం
1. [అలసెంద్రవంక]
3. [జయసింహ]
5. [ఇడుపులపాయలో]
7. [వాడుక]
9. [పక్కటెముక]
10.[లక్షాకాధిరి]
11.[బుగులు]
14.[క్లిష్టపరిస్థితులు]
15.[వసుంధర]
16.[నల్లతుమ్మచెట్టు]
నిలువు:
1. [అల్లసాని]
2.
4. [హయగ్రీవాచారి]
5. [ఇలస్ట్రేటెడువీక్లి]
6. [లోకోపకారములు]
7. [వాకబు]
8. [కలలు]
9. [పల్లెటూరిబావ]
12 [గుర్తెరిగిన]
13.[కనికట్టు]
అడ్డము:
1)అలసెంద్రవంక,3)జయసింహ,5)ఇడుపులపాయలో,7)వాడుక,9)పక్కటెముక10)లక్షాకాధికారి,11)బుగులు,14)క్లిష్టపరిస్థితులు,15)వసుంధర,16)నల్లతుమ్మచెట్టు.
నిలువు
1)అల్సాని,2)కమలజుడు,4)హయగ్రీవాచారి,5)ఇలస్ట్రేటెడ్ వీక్లి,6)లోకోపకారములు,7)వాకబు,8)కలలు9)పల్లెటూరిబావ,12)గుర్తెరిగిన,13)కనికట్టు.
చదువరిగారూ, భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ అభినందనలను అందుకోండి. సూర్యలక్ష్మిగారూ ఒకటి నిలువు సమాధానంలో టైపాటు దొర్లినట్టుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి