ఆధారాలు:
అడ్డం:
1. మురిసే మేఘాలూ, కురిసే రాగాలూ ________ _____ నా గుండెలోనా నీ చూపులే జల్లుగా.... బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని వాన పాట!
3. తొలి పొద్దులో కనిపించే మంచు బిందువు.
5. హెలికాప్టర్లు!
7. నెల నడిమి వెన్నెల హాయి కనబడదు ____ రేయి జిక్కి పాట జయసింహలో!
9. శ్రీశ్రీ పూరించమన్నది. పదబంధప్రహేళిక కాదు :-)
10. ఆత్మస్తుతి చేసుకోవడానికి ఒక జాతీయం.
11. బీరాలు, ప్రగల్భాలు!
14. నలకూబరుడు!
15. ముదితల సింగారంలో మూర్ఖత్వమున్నదా?
16. కఠినముగా అనిపించే మేక!
నిలువు:
1. సుధాముడు. శ్రీకృష్ణుని అత్యంత ప్రియమైన స్నేహితుడు!
2. హిందీలో మనం. ముందు నానాపాటేకర్ ముందు. చివర వాస్కోడిగామా చివర. వెరసి పలు ఆర్భాటములు!
4. కలవరపెట్టు
5. స్వరాజ్యము నా జన్మహక్కు అని చాటినది.
6. యమధర్మరాజు.
7. నరకబడనిది!
8. వదులు.
9. హరి త్రపము చేత క్లోరోఫిల్ పొందెనా?
12. లేత ఎండ!
13. కార్యాచరణకు ఇది అవసరమా?
7 కామెంట్లు:
అడ్డము:
1)కురిసిందివానా
3)తుహిని
5)లోహవిహాంగాలు
7)అమాస
9)పదవిన్యాసము
10)డబ్బాకొట్టుట
11)....
14)కుబేరునికొడుకు
15)ముర్ఖత్వము
16)......
నిలువు:
1)కుచేలుడు
2)నానాహంగామా
4)కలతపెట్టుట
5)లోకమాన్యతిలకు
6).....
7)....
8)సడలు
9)పత్రహరితము
12)వెచ్చనిఎండ
13)నిబద్దత
ఈసారి కష్టంగా ఇచ్చారండి.
అడ్డం:
1. [కురిసిందివానా]
3. [తుహినము] ?
5. [లోహవిహంగములు]
7. [అమాస]
9. [పర్జన్యశంఖం]
10. [డబ్బావాయింపు]
11. [డంబాలు]
14. [కుబేరతనయుడు]
15. [ముదిగారం]
16.
నిలువు:
1. [కుచేలుడు]
2. [నానాహంగామా]
4.
5. [లోకమాన్యతిలకు]
6. [లులాయవాహనుడు]
7. [అఖండం]
8. [సడలు]
9. [పత్రహరితము]
12.
13.
సూర్యలక్ష్మి గారూ అడ్డం: 3, 5,9,10,11,14,15,16 నిలువు: 4,6,7,12,13 తప్ప మిగతావి అన్నీ కరెక్టేనండి.
చదువరి గారూ అడ్డం:3, 10,నిలువు: 4, 12, 13లు మాత్రం తప్పండీ. ఈ అయిదు ఆధారాలకు సమాధానాలు సరిగ్గా ఎవరైనా కనుగొంటారో వేచి చూద్దాం.
అడ్డం:
3: తుషారము
ఈ ఆధారాలు రాక నిన్నటినించీ కష్టపడుతున్నాను. దయచేసి ఇవి సరి అయినవా చెప్పండి.
అడ్డం
3. నీహారిక 10. డప్పువాయించు 16. ము...మేక (??)
నిలువు
4.కలతపరచు 12.బాలతపము 13.ప్రణాళిక
16.ముష్కరపుమేక అనుకున్నానండీ.
ప్రసీద(సుభద్ర వేదుల)గారూ అడ్డం 16 తప్ప మిగతా అన్నీ కరెక్టే నండి! దానికి సమాధానం ముఖవిలుంఠిక!
కామెంట్‌ను పోస్ట్ చేయండి