వర్తమాన కథాకదంబం కథాజగత్ వంద కథలను ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు నిర్వహించిన కథావిశ్లేషణ పోటీ ఇంతటితో ముగిసింది. ఈ పోటీకి విశేషమైన స్పందన అనలేం కానీ వచ్చిన స్పందన మాత్రం సంతృప్తికరంగానే వుంది. ఈ పోటీ మూలంగా కథాజగత్ సందర్శకులు ఈ నెల రోజుల్లో మూడురెట్లు పెరిగారు(అంతకు ముందు నెల రోజులతో పోలిస్తే)! పాల్గొన్న వారు మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 16 కథలపై 17 విశ్లేషణలు 11మంది బ్లాగర్ల నుండి పోటీకి వచ్చాయి. పాల్గొన్న అందరికీ తురుపుముక్క అభినందనలను తెలియజేస్తోంది. శుభాకాంక్షలను అందిస్తున్నది. ఫలితాలు అతి త్వరలో తెలియజేస్తాం. ఈ పోటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పోటీకి ప్రాచుర్యం కల్పించిన మాలిక, కూడలి సంకలినుల నిర్వాహకులకు మా కృతజ్ఞతలు! మునుముందు మీ అందరి ప్రోత్సాహం తురుపుముక్క, కథాజగత్లపై యిలాగే వుండగలదని ఆశిస్తున్నాం.
5 కామెంట్లు:
Sir,
I think you can tell us the judges names now..:)))
and it will also be appreciated if you can share the date of winners' announcement.
Regards,
Rakesh Sastri
రాకేష్ శాస్త్రిగారూ ప్రస్తుతం బంతి న్యాయనిర్ణేతల కోర్టులో ఉంది :-) వారు నిర్ణయం తెలిపిన వెంటనే ఫలితాలు వెలువడుతాయి. ఈ నెలాఖరుకు గానీ ఆగష్టు మొదటివారంలో గానీ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక న్యాయనిర్ణేతలెవరో ఇంకొన్నిరోజులు గోప్యంగా ఉంచదలిచాము.
Hi Sir..one week's up..any update on the results?
We are very eager to see the winners.
chaala aalasyam chestunnaarandi.
17 visleshanalaki inni rojulaa..............? meeru phalitaalu tvaragaa prakatinchaalani aasistunnam. Inta time untundante madhyalo nenu kooda edo okati raasese vanni.
intaki eppudu telustaayi maaku results?
Pradeep Varma
అజ్ఞాతగారూ, రాయప్రోలు ప్రదీప్ వర్మగారూ ఫలితాల ఆలస్యానికి క్షమించాలి. న్యాయనిర్ణేత పి.జి. పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ పనిలో తలమునకలై ఉన్నారు. వారు తమ నిస్సహాయతను తెలియజేశారు. ఆగష్టు మొదటి వారంలో తమ నిర్ణయం తెలియజేస్తామన్నారు. అంత వరకూ ఓపిక పట్టండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి