...

...

31, జులై 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 20


ఆధారాలు: 

అడ్డం: 
1. వెనుదిరిగిన కామన్ సెన్స్!
3. ఇది వదిలితే చచ్చినట్టే!
5. విజయనగరంలో జరుపుకునే ప్రసిద్ధి చెందిన ఉత్సవము మన లష్కర్‌లో బోనాలు వంటిదే?
7. పాడ్యమి తరువాత! తదియకు ముందా?
9. విరోధము, భిన్నత, వేరు, మారు.
10. పెత్తనం లాంటిదే కలగాపులగం అయ్యింది.
11. ఎంత వైరాగ్యమైతే మాత్రం ఇలా తిరగేసి రాయాలా?
14. ఎస్.డి.వి. అజీజ్ చారిత్రక నవల! ఈ పుస్తకానికి ఈ బ్లాగరే పబ్లిషర్!
15. lymerick శ్రీశ్రీ చేతిలో ఇలా మారిపోయింది :)
16. అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానం!
నిలువు:
1. పాకిస్థాన్ మాజీ సైనిక నియంత!
2. సకుటుంబ సమేతంగానే !
4. సామాన్యుడు. ఇతడి స్వగతం కస్తూరి మురళీకృష్ణ కెరుక!
5. నేనూ నా వింతలమారి ప్రపంచమూ అంటూ ఒక మహత్తరమైన దృశ్యకావాన్ని అందించిన దళిత కవి?
6. మొదటి అక్షరం ఎగిరిపోయిన కిరోసిన్ దీపము! లాంతరుకు చెల్లెలా? :))
7. ఖైదీలు కోరేది?
8. తలక్రిందలైన ఏ.పి.డైరీ పాలు!
9. స్టైల్ ఆఫ్ యాక్షన్ ఒక్కొక్కరిది ఒక్కో తీరు!
12. ఆలోకనం రచయిత్రిని కథాజగత్‌లో వెదకండి!
13.  అనితర సాధ్యం ఇతని మార్గం!

7 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

అడ్డం
1. [మునజ్ఞాతగిఇం]
3. [తుదిశ్వాస]
5. [పైడితల్లిజాతర]
7. [విదియ]
9. [వ్యతిరేకము].
10. [జఆయిమాషి]
11. [క్తిరవి]
14. [బుడ్డావెంగళరెడ్డి]
15. [లిమఋక్కు]
16. [నియోజకవర్గం]
నిలువు:
1. [ముషారఫ్]
2. [ఇంటిల్లిపాది]
4. [సగటుమనిషి]
5. [పైడితేరేషుబాబు]
6. [రసనాయిలుబుడ్డి]
7. [విముక్తి]
8. [యజవి]
9. [వ్యక్తిగతశైలి]
12. [రమగమిని]
13. [శ్రీశ్రీమార్గం]

ఊకదంపుడు చెప్పారు...

నమస్కారమండీ.


1) ము న జ్ఞా త గి ఇం
3) తుదిశ్వాస
7) విదియ
9)వ్యతిరేకము
10) జ - - - షి ( అజ మాయిషి అ, మా యి ల స్థానములు ఇంకా తెలియలా )
11) క్తి ర వి
15) లిమరిక్కు
16) నియోజకవర్గం


నిలువు
1) ముషారఫు
2) ఇంటిల్లిపాదీ
4)సగటుమనిషి
7) విముక్తి
9)వ్యక్తిగత శైలి
13) శ్రిశ్రీ మార్గం
8) య జ వి



చదువరి గారూ,
పొద్దులో వాడే, గడి లోనే నింపుకునే మెత్త ఉడుపు ఉచితమా, అనుచితమా

ఊకదంపుడు చెప్పారు...

చదువరి గారూ
ఇదేదో "ఆశు"వర్డ్ పజిలనట్టుందే మీకు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1) మునజ్ఞాతగిఇం (ఇంగితజ్ఞానము)
3) ఎగశ్వాస
5) పైడితల్లిజాతర
7) విదియ
9) వ్యతిరేకము
10)జఅయిమాషి(అజమాయిషి)
11)క్తిరవి(విరక్తి)
14)బుడ్డావెంగళరెడ్డి
15)లిమరుక్కు.
16)నియోజకవర్గం.
నిలువు:
1)ముషారఫ్
2)ఇంటిల్లిపాది
4)సగటుమనిషి
5)పైడితెరేష్ బాబు
6)రసనాయిలబుడ్డి
7)విముక్తి
8)యజవి(విజయ)
9)వ్యక్తిగతశైలి
12)రమగమిని
13)శ్రీశ్రిమార్గం

mmkodihalli చెప్పారు...

చదువరి, ఊకదంపుడు, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు! చదువరిగారూ, సూర్యలక్ష్మిగారూ మీ సమాధానాలు ఆల్ మోస్ట్ ఆల్ కరెక్టేనండి. అయితే నిలువు 9 నేను అనుకొన్నది మాత్రం వ్యక్తిగత శైలి కాదు వ్యవహార శైలి. ఊకదంపుడు గారూ లిమరిక్కు కాదండి అది లిమఋక్కు. ఇక చదువరి గారూ ఊ.దం. మహాశయులు అడిగినట్లు పొద్దులో వాడే, గడి లోనే నింపుకునే మెత్త ఉడుపు ఉచితమా? ఉచితమే అయితే అదేదో నాకు అందించి పుణ్యం కట్టుకోండి.

చదువరి చెప్పారు...

ఊకదంపుడు: ఆశువుగా వచ్చేది కొన్నేనండి. మిగతావి గూగులమ్మ పుణ్యమే. పైగా, మురళీమోహన్ గారు చతురులు - పజిలు మరీ విరక్తి కలక్కుండా, గూగుల్లో తేలిగ్గా దొరికేవాటినే ఇస్తూంటారు. ఏదేమైనా మీరు మెచ్చారు, నెనరులు. ప్రతిభ గూగులుదైనా మెప్పు నాకు దక్కింది. :)

కోడీహళ్ళి మురళీ మోహన్: సార్, నేను మీకు ఉత్తరం రాస్తాను.
మెత్త ఉడుపు - మృదులాంత్రం కంటే ఇది బాగుంది సార్.

చదువరి చెప్పారు...

ఊకదంపుడు గారూ, మీ మొదటి వ్యాఖ్యలోని - "చదువరి గారూ, పొద్దులో వాడే, గడి లోనే నింపుకునే మెత్త ఉడుపు ఉచితమా, అనుచితమా" అనే వాక్యాన్ని నేను గమనించలేదు. ఇప్పుడే చూసాను. త్వరలో అది ఉచితమౌతుందండి. ప్రస్తుతానికి అనుచితమే! :)